సిరి బండారం బయటపెట్టిన నాగార్జున.. ఆమె సిగ్గుతో తల దించుకునేలా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో వీక్ డేస్ ఎపిసోడ్ల కంటే వీకెండ్ ఎపిసోడ్లు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటాయనే సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున హౌస్ లోని కంటెస్టెంట్ల తప్పొప్పులను చెబుతూ కంటెస్టెంట్లు చేసే తప్పులను సరి చేసుకునేలా జాగ్రత్త పడతారు.

బిగ్ బాస్ హౌస్ లో శనివారం రామ్ చరణ్ తో పాటు మాస్ట్రో టీమ్ సందడి చేశారు.

నాగార్జునను తాను అన్నయ్య అని పిలుస్తానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.తన అక్క సంగీత్ కు యానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిందంటూ చరణ్ షోలో ఆసక్తికర విషయాన్ని చెప్పారు.

నటరాజ్ మాస్టర్ ఒకరోజు తనకు చరణ్ ఫ్లేట్ లో ఫుడ్ తీసుకొని వచ్చి ఇచ్చారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

ప్రియ చరణ్ ను బిగ్ బాస్ హౌస్ లో ఉంచుకుంటామని చెప్పగా నాగార్జున రాజమౌళి అందుకు ఒప్పుకోడంటూ కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

హమీదా ఫేస్ పై పెయింట్ తో కొట్టడం గురించి నాగ్ ప్రశ్నించగా శ్వేతా వర్మ అందరి ముందు చెంప దెబ్బలు కొట్టుకున్నారు.

"""/"/ ఆ తర్వాత సిరిని నాగార్జున సన్నీ షర్ట్ లోపల్ చేయి పెట్టి బెటాన్ తీశాడా అని అడగగా ఆమె అవునని సమాధానం ఇచ్చింది.

షణ్ముఖ్ కూడా సిరి చెప్పింది నిజమేనని చెప్పగా నాగార్జున టాస్క్ కు సంబంధించిన వీడియోను ప్లే చేసి సన్నీ ఏ తప్పు చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.

నాగార్జున సిరి బండారం బయటపెట్టడంతో ఆమె తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.నిజానిజాలు తెలిసిన తర్వాత మాత్రమే అవతలి వ్యక్తి క్యారెక్టర్ ను డిసైడ్ చేయాలని నాగార్జున పేర్కొన్నారు.

ఆ తర్వాత సన్నీకి సిరి సారీ చెప్పింది.ఎలిమినేషన్ లో ఏడుగురు ఉండగా నాగార్జున ప్రియాంక సింగ్, లోబో, యానీ మాస్టర్ సేఫ్ అయినటు ప్రకటించడం గమనార్హం.

క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి తగిలిన జాక్‌పాట్.. ఎంతంటే..??