అమలకు ముందుగా నాగార్జున ప్రపోజ్ చేశాడు.. లవ్ సీక్రెట్ బయట పెట్టిన అమల బ్రదర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కింగ్ నాగార్జున గురించి అందరికీ సుపరిచితమే.

ఆరు పదుల వయసులో కూడా నాగార్జున హీరోగా నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేస్తున్నారు.

కెరియర్ పరంగా ఎంతో అద్భుతంగా కొనసాగుతున్న నాగార్జున వ్యక్తిగత విషయానికివస్తే నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించిన అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే వీరిద్దరిలో ముందుగా ఎవరు ఎవరికి ప్రపోస్ చేశారనే విషయం గురించి తెలుసుకోవాలని ఆత్రుత ప్రతి ఒక్క అభిమానుల్లోనూ ఉంటుంది.

అయితే ఈ విషయం గురించి నాగార్జునను అడిగే సాహసం ఎవరు చేయలేరు.ఈ క్రమంలోనే అమల బ్రదర్ సురేష్ చక్రవర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వీరి లవ్ సీక్రెట్ గురించి బయట పెట్టారు.

సురేష్ చక్రవర్తి అమల కజిన్ బ్రదర్.ఇతను కజిన్ బ్రదర్ అయినప్పటికీ సొంత అన్నయ్య కన్నా ఎక్కువగా అమల తనని ఆరాధించేదని ఆయన వెల్లడించారు.

"""/"/ఇక నాగార్జున అమల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియ చేసిన సురేష్ చక్రవర్తి వీరి లవ్ సీక్రెట్స్ కూడా బయట పెట్టారు.

వీరిద్దరిలో ముందు ఎవరికి ఎవరు ప్రపోజ్ చేసుకున్నారనే ప్రశ్న ఎదురవడంతో నాగార్జున అమలకు ముందుగా ప్రపోజ్ చేశారని ఈ సందర్భంగా సురేష్ చక్రవర్తి నాగార్జున, అమల లవ్ స్టోరీ గురించి బయట పెట్టారు.

ఈ క్రమంలోనే సురేష్ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బిగ్ బాస్ 8 ఫినాలేలో సందడి చేసిన రామ్ చరణ్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?