Nagarjuna Nagachaitanya Akhil : నాగార్జున అలా చేసి ఉంటే నాగచైతన్య, అఖిల్ 100 కోట్ల హీరోలు అయ్యేవారా.. ఏమైందంటే?

స్టార్ హీరో నాగార్జున( Nagarjuna ) హీరోగా, రియాలిటీ షో హోస్ట్ గా ఎంత బిజీగా ఉన్నా వ్యాపారాలపై కూడా ఫుల్ ఫోకస్ పెడుతూ బిజినెస్ లో కూడా రాణిస్తున్నారు.

అయితే నాగచైతన్య,( Naga Chaitanya ) అఖిల్( Akhil Akkineni ) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయినా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

నాగచైతన్య మార్కెట్ 40 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండగా అఖిల్ మార్కెట్ 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

వాస్తవానికి నాగ్ తలచుకుని ఉంటే నాగచైతన్య, అఖిల్ 100 కోట్ల హీరోలు అయ్యేవారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తొలి సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సినిమాల కథ, కథనం విషయంలో నాగ్ జాగ్రత్తలు తీసుకుని ఉంటే చైతన్య, అఖిల్ లకు ఈపాటికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

"""/" / నాగచైతన్య, అఖిల్ ఖాతాలలో ఇప్పటికీ సరైన ఇండస్ట్రీ హిట్ లేదు.

కెరీర్ పరంగా మంచి సక్సెస్ ను అందుకోవడం కోసం ఈ హీరోలు పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.

నాగ్ ఇప్పటికైనా కొడుకుల కెరీర్ పై ఫోకస్ పెట్టాల్సి ఉంది.చాలామంది యంగ్ హీరోలు వరుస విజయాలు అందుకుంటుండగా నాగచైతన్య, అఖిల్ లకు మాత్రం తమ స్థాయికి తగ్గ విజయాలు దక్కడం లేదు.

"""/" / నాగార్జున కెరీర్ కూడా మరీ ఆశించిన స్థాయిలో లేకపోయినా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో( Village Backdrop Movies ) తెరకెక్కిన సినిమాలు నాగార్జున రేంజ్ ను పెంచుతున్నాయి.

నాగార్జున సినిమాలకు 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లు వస్తున్నాయి.నాగ్ రాబోయే రోజుల్లో అయినా కొడుకుల కెరీర్ పై దృష్టి పెడతారేమో చూడాలి.

నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అత్యంత భారీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.

వైరల్: పిల్లి, కప్పతో పాము పోరాటం.. మామ్మూలుగా లేదుగా!