సంక్రాంతికి నా సామి రంగ అల్లరోడిదే అగ్రస్థానం
TeluguStop.com
సంక్రాంతి సందర్భంగా రాబోతున్న సినిమా లు చాలానే ఉన్నాయి.అందులో ఒకటి నాగార్జున ( Nagarjuna )నటిస్తున్న సినిమా నా సామి రంగ.
ఈ సినిమా లో మరో ఇద్దరు యంగ్ హీరో లు కూడా నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
నాగార్జున వయసుకు తగ్గ పాత్ర లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.తాజాగా అల్లరి నరేష్ పాత్రకు సంబంధించిన లుక్ తో పాటు వీడియో విడుదల చేయడం జరిగింది.
అంజి పాత్ర లో అల్లరోడు కనిపించబోతున్నాడు.ఫుల్ లెంగ్త్ కామెడీ తో అల్లరి చేసే పాత్ర గా కనిపిస్తున్నాడు.
"""/" /
నా సామి రంగ సినిమా( Naa Saami Ranga Movie ) లో కచ్చితంగా అల్లరోడి హడావుడి మామూలుగా ఉండదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
నిజమే అన్నట్లుగా టీజర్ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.రాజ్ తరుణ్ మరియు అల్లరి నరేష్( Allari Naresh ) కలిస్తే ఎంటర్ టైన్‌మెంట్ ఏ స్థాయి లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే సంక్రాంతికి కచ్చితంగా నా సామి రంగ సినిమా ఓ రేంజ్ లో వినోదాన్ని పంచడం ఖాయం అంటూ ప్రేక్షకులు కూడా నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
"""/" / రేపటి నుంచే టీజర్ విడుదల చేయడం ద్వారా ప్రమోషన్ ను షురూ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా లో నాగార్జున పాత్ర తో పాటు అన్ని పాత్ర లు కూడా చాలా వినోదాత్మకంగా ఉంటాయి అంటున్నారు.
సంక్రాంతికి ఉన్న పోటీ నేపథ్యం లో కూడా ఈ సినిమా ను విడుదల చేస్తున్నారంటే కచ్చితంగా సినిమా కు ఉన్న బజ్ మరియు ఆ సినిమా పై ఉన్న నమ్మకం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
నాగార్జున గత చిత్రాల ఫలితాలు తీవ్రంగా నిరాశ పరిచాయి.మరి ఈ సినిమా అయినా సక్సెస్ ను దక్కించుకుంటుందేమో చూడాలి.