సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనిక హీరో ఎవరో తెలుసా.. అసలు ఊహించలేరుగా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఒక్కో సినిమాకు 100 కోట్లు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

ఇలా కోలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ శాండల్ వుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది బడా హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ కొందరు హీరోలు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటూ సంచలనాలను సృష్టిస్తున్నారు.

ఈ క్రమంలోనే సౌత్ ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన హీరో ఎవరు అనే విషయం గురించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

"""/" / మెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్ చేసిన సర్వే ప్రకారం సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైనటువంటి హీరో ఎవరు అనే విషయాన్ని వెల్లడించారు.

మరి ఈ మ్యాగజైన్ నివేదిక ప్రకారం సౌత్ ఇండస్ట్రీలోనే అందరికంటే రిచెస్ట్ హీరో( Richest Hero ) గా మొదటి స్థానంలో ఉన్నది నటుడు అక్కినేని నాగార్జున( Nagarjuna ) ఈయన ఆస్తులు విలువ 3 వేల కోట్లకు పైగా ఉందని సమాచారం .

ఇలా ధనవంతులైనటువంటి హీరోల జాబితాలో నాగార్జున ముందు వరుసలో ఉండటం విశేషం.ఒక్కో సినిమాకు కేవలం 9 కోట్ల నుంచి పది కోట్ల మధ్యలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఇండస్ట్రీలో 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని హీరోలు కూడా ఉన్నారు.ఆయన ఇప్పటికీ నాగార్జున మొదటి స్థానంలో ఉండటం విశేషం.

"""/" / నాగార్జున కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాఖ్యాతగా ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.

అలాగే ఈయన సినిమా ఇండస్ట్రీకి కీలకంగా మారిన అన్నపూర్ణ స్టూడియో ( Annapurna Studios ) ద్వారా కూడా భారీ స్థాయిలో లాభాలను అందుకుంటున్నారు.

ఇకపోతే ఈయకు పలు రియల్ ఎస్టేట్ బిజినెస్ లు కూడా ఉన్నాయని మనకు తెలిసింది.

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా నాగార్జున భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారు.

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఫంక్షన్లు అన్ని కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి.అలాగే నాగార్జున నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా సుమారు 50 కోట్ల విలువ చేస్తుందని సమాచారం తక్కువగా తీసుకుంటున్నప్పటికీ ఈయన అత్యంత ధనికుడైనటువంటి హీరోగా మొదటి స్థానంలో ఉండటం గమనార్హం.

ఢిల్లీ మెట్రోలో యువతి ఓవరాక్షన్.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..