అస్సలు టైం బాగాలేదు.. అయోమయంలో నాగార్జున
TeluguStop.com
ప్రస్తుతం నాగార్జున టైం అస్సలు బాగా లేనట్లు కనిపిస్తోంది.ఆయన ఏ పని చేసినా.
అంతగా కలిసి రావట్లేదు.పైగా కుటుంబం నిండా సమస్యలు నెలకొని ఉన్నాయి.
శ్రీరామదాసు సినిమా తర్వాత ఆయన ఖాతాలు మరో గట్టి హిట్టు పడలేదు.సోగ్గాడె చిన్నినాయన సినిమా ఫర్వాలేదు అనిపించినా.
ఆ తర్వాత వర్మ తెరకెక్కించిన ఆఫీసర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.మన్మథుడు-2 కూడా పెద్దగా ఆడలేదు.
పెద్దకొడుకు పెళ్లి పెటాకులు కావడం, చిన్న కొడుకు పెళ్లి ఆగిపోవడం, సుమంత్ పరిస్థితి బాగాలేకపోవడం, స్టూడియో వ్యవహారాలు ఆశాజనకంగా కనిపించకపోవడం, చివరకు నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కూడా అంతగా జనాలను ఆకట్టుకోలేకపోతున్నాయి.
ఆయన పరిస్థితి ఎటు చూసినా బాగా లేదనే చెప్పుకోవచ్చు.62 సంవత్సరాలు నిండినా పలువురు టాలీవుడ్ హీరోలు ఇప్పటికీ మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
కానీ నాగార్జున పరిస్థితి మాత్రం సరిగా లేదు.తాజాగా ఆయన నటించిన సినిమా వైల్డ్ డాగ్ జెమిని టీవీలో ప్రసారం అయ్యింది.
అయితే ఈ సినిమాకు దారుణంగా రేటింగ్స్ వచ్చాయి.సినిమా మరీ అంత చెత్తగా లేకున్నా.
బాగానే ఉంది.మంచి కథ, దానికి తగినట్లు యాక్షన్ సీన్లు కూడా బాగానే పెట్టారు.
అయినా ఈ సినిమాను బుల్లితెర ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. """/"/
తాజాగా ఈ సినిమాకు వచ్చిన రేటింగ్ జస్ట్ 4 మాత్రమే.
ఈ నెల 7న జెమినిలో ఈ సినిమా వచ్చింది.కానీ ఈ రేటింగ్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
చాలా సినిమాలు పదే పదే టీవీలో వేసినా ఈ స్థాయి రేటింగ్ రావడం ఖాయం.
కానీ నాగార్జున మూవీకి ఐదు రేటింగ్ కూడా రాలేదు.మొత్తంగా నాగార్జున పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగాలేనట్లు కనిపిస్తోంది.
ఆయన తోటి హీరోలు వెంకటేష్, బాలయ్య, చిరంజీవి పలు కొత్త సినిమాలు చేస్తూ.
కుర్ర హీరోలతో పోటీపడి మరీ ముందుకు సాగుతున్నారు.నాగార్జున పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతోంది.
ఇప్పటికైనా ఆయన సరిగా కెరీర్ మీద కాన్సెట్రేట్ చేయాలంటున్నారు సినీ జనాలు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీపికబురు.. వార్2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ అప్పుడేనా?