తమిళ్ స్టార్ డైరెక్టర్ సినిమాలో నటిస్తున్న నాగార్జున…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న చాలామంది నటులు సినిమాలను చేయడంలో వాళ్ల వల్ల సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున( Nagarjuna ) లాంటి స్టార్ హీరోలు సైతం వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర( Kubera ) అనే సినిమాలో ఒక కీలక పాత్రలు నటిస్తున్న నాగార్జున ఈ సినిమా తర్వాత తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన వెట్రి మారన్( Vetrimaaran ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

"""/" / కాబట్టి ఆయన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆయన సినిమాల్లో ఒక ఆర్ట్ అనేది ఉంటుంది.అందువల్లే ఆయన సినిమాలు చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ సినిమాలకు ఫిదా అయిపోతూ ఉంటారు.

మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉండడమే కాకుండా ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉంటుంది.ఇక ఇప్పటివరకు ఆయన ధనుష్ తో( Dhanush ) చేసిన ప్రతి సినిమా కూడా ఒక విజువల్ వండర్ గా తెరకెక్కడమే కాకుండా ఆయన మార్క్ ప్రేక్షకులందరికీ కనిపిస్తుంది.

ఇక ఇలాంటి దర్శకుడు నాగార్జునతో సినిమా చేస్తున్నాడు అనగానే యావత్ తమిళ్ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది.

"""/" / నిజానికి నాగార్జున ఇందులో హీరో గా చేస్తున్నాడా ఏదైనా చిన్న క్యారెక్టర్ లో చేస్తున్నాడో తెలియదు గానీ, వెట్రి మారన్ మాత్రం నాగార్జున తో సినిమా చేస్తున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా కొన్ని కథలను వెలువరించింది.

ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని నాగార్జున ప్రయత్నం అయితే చేస్తున్నాడు కుబేర తో సక్సెస్ అందుకోవడమే కాకుండా వెట్రి మారన్ సినిమాతో కూడా భారీ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

మరి ఈ ప్రాజెక్టు అనేది సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

బురఖా ధరించి బైక్ పై రెచ్చిపోయిన యువకుడు.. చివరికి.?