నాగచైతన్య శోభిత పెళ్లికి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వబోతున్న నాగార్జున… ఎన్ని కోట్లో తెలుసా?
TeluguStop.com
సినీ నటుడు నాగచైతన్య( Naga Chaitanya ) శోభితల( Sobhita ) వివాహం డిసెంబర్ 4వ తేదీ ఎంతో ఘనంగా జరగబోతుంది.
అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయ ప్రకారం జరగబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లన్ని కూడా పూర్తి అయ్యాయి.ఇక శోభిత నాగచైతన్య హల్ది వేడుక కూడా ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సంచలనంగా మారాయి.
"""/" /
ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో నాగార్జున( Nagarjuna ) ఈ కొత్త జంటకు ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్( Surprise Gift ) ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
కోట్ల విలువచేసే ఈ గిఫ్ట్ నాగార్జున తన కొడుకు కోడలుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మరి నాగచైతన్య శోభిత కోసం నాగార్జున ఇవ్వబోయే ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.
అది మరి ఏదో కాదు ఈయన ఖరీదైన కారును వారికి పెళ్ళికానుకగా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
"""/" /
నాగార్జున ఇటీవల కొత్త కారును కొన్న విషయం మనకు తెలిసిందే.
సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన అధునాతన లెక్సస్ LM MPV కారును( Lexus LM MPV Car ) కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయంలో తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇటీవల ఆర్టీవో ఆఫీసుకు నాగార్జున వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కారును నాగచైతన్య శోభిత పెళ్లికి కానుకగా ఇవ్వాలని నాగార్జున కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
ఈ కారు దాని హైబ్రిడ్-ఎలక్ట్రిక్ డిజైన్ తో వచ్చింది., కార్బన్-న్యూట్రల్ ఫీచర్ తో పాటు చాలా లగ్జరీ ఫీచర్స్ ను అద్భుతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది.
ఇక ఈ కారు కాస్ట్ 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
కోతి-కింగ్ కోబ్రా స్నేహం.. ఏకంగా మెడలో వేసుకొని.. వీడియో వైరల్