నాగార్జున కొడుకు విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు
TeluguStop.com
ఆరు సంవత్సరాల క్రితం అఖిల్ సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారి ప్రిన్స్ అఖిల్ కు ఎట్టకేలకు విజయం దక్కింది.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తో ఘన విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు.
ఈ కరోనా సమయంలో బ్యాచిలర్ సినిమా 40 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది.
ఈ వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి సినిమా వసూళ్లు 50 కోట్ల ను మించుతాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
కొడుకు ఎట్టకేలకు కమర్షియల్ హిట్ ను దక్కించుకున్న నేపథ్యంలో నాగార్జున ఆనందంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆయన తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇండస్ట్రీ వర్గాల వారికి పార్టీ ఇచ్చాడు.
బ్యాచిలర్ సక్సెస్ నేపథ్యంలో నాగార్జున ఇచ్చిన పార్టీ గురించి మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
బ్యాచిలర్ సక్సెస్ పార్టీలో ఇండస్ట్రీకి చెందిన దాదాపుగా పదిహేను మంది ప్రముఖ దర్శకులు హాజరు అయ్యారు.
ఈ పార్టీలో హాజరు అయిన దర్శకుల్లో పలువురితో అఖిల్ సినిమాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
నాగార్జున అదే ప్లాన్ గా దర్శకులతో పార్టీని చేశాడంటూ వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వం లో అఖిల్ ఏజెంట్ సినిమా ను చేస్తున్న విషయం అందరికి తెల్సిందే.
"""/"/
ఈ నెల చివరి వారంలో సినిమా చిత్రీకరణ పునః ప్రారంభం అవ్వబోతన్నట్లుగా చెబుతున్నారు.
భారీ అంచనాలున్న ఏజెంట్ సినిమాను స్టైలిష్ గా అద్బైతమైన స్క్రిప్ట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు ఇండస్ట్రీ వర్గాల వారిని కూడా ఆకట్టుకునేలా ఏజెంట్ లుక్ ఉంది.
కనుక సినిమా కూడా ఖచ్చితంగా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
అఖిల్ విజయంతో నాగార్జున ఇచ్చిన పార్టీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ముందు ముందు అఖిల్ బ్యాచిలర్ వంటి మరిన్ని సక్సెస్ లను దక్కించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే మీ పల్చటి జుట్టు దట్టంగా మారడం పక్కా!