ఆ బిజినెస్‌లో పడి సూపర్ హిట్ సినిమాలు మిస్ చేసుకున్న నాగార్జున.. ఏం జరిగిందంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మన్మధుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటుడు నాగార్జున.

ఈయన గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరో గా నిలిచాడు.

ఎప్పుడో సినిమాల్లోకి అడుగు పెట్టిన నాగార్జున ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.పైగా యంగ్ హీరోలతో పోటీగా నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే నాగార్జున బిజినెస్ లో పడి మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు వదులుకున్నాడట.

1986లో విక్రం సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.అదే ఏడాది కెప్టెన్ నాగార్జున సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అలా తొలి సినిమాతోనే మంచి హిట్ ను అందుకోగా ఆ తర్వాత మజ్ను, కలెక్టర్ గారి అబ్బాయి, ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ వంటి ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరో గా నిలిచాడు.

ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.దాదాపు 85 కి పైగా సినిమాలలో నటించాడు నాగార్జున.

"""/"/ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో వ్యాఖ్యాతగా చేశాడు.

వాణిజ్య ప్రకటనల్లో కూడా చేశాడు.ఇక ప్రస్తుతం వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కు వ్యాఖ్యాతగా చేస్తున్నాడు.

అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సంస్థలో నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.కేవలం నటుడిగానే కాకుండా పలు బిజినెస్ లు కూడా చేస్తున్నాడు.

కానీ ఈ బిజినెస్ వల్లనే గతంలో మంచి మంచి సినిమాలను వదులుకున్నాడు.గత కొన్నేళ్ల కిందట నాగార్జున మంచి హోదాలో ఉన్న సమయంలో సినిమాలను పక్కకు పెట్టాడు.

ఆ సమయంలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ పనులను చూసుకున్నాడట.తాను నటించిన సినిమా ఫ్లాఫ్ కావడంతో కాస్త బ్రేక్ తీసుకున్నట్లు తెలిసింది.

దాంతో బిజినెస్ పైపు అడుగులు పెట్టి బాగా బిజీగా మారాడు.అంతేకాకుండా తనపై కాకుండా తన పెద్ద కొడుకు నాగచైతన్య కెరీర్ పై కూడా శ్రద్ధ పెట్టాడని తెలిసింది.

"""/"/ అదే సమయంలో తమ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోలో కూడా కొన్ని పనులలో బిజీగా ఉన్నాడని దాంతో మంచి మంచి సినిమాలు వచ్చినా కూడా వదులుకున్నాడు అని తెలిసింది.

అంతకుముందే ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేస్తానని ఒప్పుకున్నాడట.ఇక శేఖర్ కమ్ములతో కూడా ఓ సినిమా చేయాలని అనుకున్నాడట.

దిల్ రాజు కూడా ఒక కథ చెప్పగా దాన్ని నిరాకరించాడట.అలా కొన్ని సినిమాలను వదులుకోవడానికి కారణం రియల్ ఎస్టేట్ ఒకటైతే మరో కారణం అప్పటి పరిస్థితుల్లో తన కొడుకు నాగచైతన్యను హీరోగా చేయడానికి బాగా శ్రద్ధ పెట్టాడట.

ఇక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ వంటి మొదలైన నిర్మాణం పనులలో బిజీగా ఉండటంతో మంచి మంచి హిట్లు అందుకున్న సినిమాలను వదులుకున్నాడని తెలిసింది.

ఇక ఈమధ్య వరుస సినిమాలలో నటించిన కూడా అంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు.ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు.

ఇందులో కూడా నాగ చైతన్య ఓ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.

అంతేకాకుండా మరో సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్లు తెలిసింది.

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. సీఎం జగన్ హాట్ కామెంట్స్