ఆ ఒక్క కారణంతోనే హడావిడిగా చైతన్య నిశ్చితార్థం.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
TeluguStop.com
అక్కినేని వారసుడు నాగచైతన్య( Naga Chaitanya ) నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన సంగతి మనకు తెలిసిందే.
నటి సమంతను పెళ్లి చేసుకుని ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య మరొక నటి శోభిత( Sobitha ) ప్రేమలో పడ్డారు.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఆగస్టు 8వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే నిశ్చితార్థ అనంతరం నాగార్జున( Nagarjuna ) ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని నాగచైతన్య శోభిత ప్రేమ గురించి వారిని నిశ్చితార్థం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.
"""/" /
ఇక నాగచైతన్య శోభిత గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెద్దవారి దగ్గర చెప్పడంతో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ నిశ్చితార్థపు వేడుక జరిగింది కానీ ఈ వేడుకకు ఎవరు సినీ సెలబ్రిటీలు హాజరు కాలేదు, చైతన్య అమ్మ తరపు బంధువులైన దగ్గుబాటి ఫ్యామిలీ( Daggubati Family ) కూడా ఈ నిశ్చితార్థం వేడుకలలో కనిపించలేదు.
ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత నిశ్చితార్థం ఇలా హడావిడిగా చేయడానికి గల కారణం ఏంటనే సందేహం అందరిలోనూ ఉంది.
"""/" /
ఇక ఇదే విషయం గురించి నాగార్జున ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.
నాగచైతన్య శోభిత నిశ్చితార్థానికి ఎవరిని పిలవక పోవడానికి కారణం ఉంది.వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని మాకు తెలియజేశారు.
వారి ప్రేమ మీద 100% వారికి క్లారిటీ ఉందనే విషయం తెలియగానే వారి పెళ్లికి ఒప్పుకున్నామని తెలిపారు.
ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు అంతేకాకుండా నాగచైతన్య శోభిత జాతకం ,నక్షత్రం ఆధారంగా ఆ రోజే బలమైన ముహూర్తం ఉన్న నేపథ్యంలో సింపుల్ గా నిశ్చితార్థం చేయాల్సి వచ్చిందని నాగార్జున ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక వీరి వివాహం కొద్ది నెలల విరామం తర్వాత జరుగుతుందని తెలిపారు.
పాలకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎవరెవరు తినకూడదో తెలుసా?