బయట పడ్డ టాలీవుడ్ ఐక్యత.. ఇలా అయితే టికెట్ల ఇష్యూ తెగినట్లే

టాలీవుడ్‌ లో ఉన్న ఐక్యత మరోసారి బట్ట బయలు అయ్యింది.గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ లో టికెట్ల ఇష్యూ వివాదం నడుస్తోంది.

ఈ సమయంలో కొందరు ఏపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మరి కొందరు మాత్రం ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉన్నారు.

ఏపీలో ఉన్న టికెట్ల రేట్లకు థియేటర్లను నడపలేం అంటూ సురేష్‌ బాబు చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి.

ఇప్పుడు టాలీవుడ్‌ కింగ్ నాగార్జున బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్‌ లో మాట్లాడుతూ తనకు ఏపీ లో ఉన్న టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

తాను ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో అసంతృప్తిగా లేను.పైగా నా సినిమాల బడ్జెట్‌ కు అక్కడ ఉన్న టికెట్ల రేట్లకు సెట్‌ అవుతుంది అన్నట్లుగా మాట్లాడాడు.

ఒక వైపు ఏపీలో టికెట్ల రేట్లను పెంచాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు డిమాండ్‌ చేస్తూ ఉంటే.

ఏపీ ప్రభుత్వం కూడా భారీగా కాకున్నా కొద్ది మొత్తంలో అయినా పెంచేందుకు ఓకే చెప్పింది.

త్వరలోనే ఆ నిర్ణయం తీసుకుంటారని అనుకుంటూ ఉండగా అనూహ్యంగా నాగార్జున టికెట్ల రేట్ల సమస్య కాదు అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యింది.

నాగార్జున ఇలా మాట్లాడటంను బయ్యర్లు అస్సలు ఒప్పుకోవడం లేదు.అక్కడ టికెట్ల రేట్లు ఉన్న పరిస్థితికి పెద్ద సినిమాలను విడుదల చేయలేక పోతున్నారు.

అందరి విషయాన్ని దృష్టి లో పెట్టుకుని మాట్లాడాలే కాని ఇలా నా సినిమాలకు ఇబ్బంది లేదు అన్నట్లుగా వ్యక్తిగతంగా మాట్లాడటం ఏమాత్రం పెద్దరికం అనిపించుకోదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 ఒక వైపు నాగార్జున వ్యాఖ్యలకు దుమారం రేగుతున్న సమయంలో మరో వైపు బయ్యర్లు ఏపీ ప్రభుత్వం తో చర్చించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించారు.

బంగార్రాజు సినిమా కు బయ్యర్ల నుండి సహకారం దక్కుతుందా అనేది చూడాలి.

వాటే ఐడియా: ఇలా చేస్తే నీ ఆటో ఎందుకు ఎక్కరు గురూ.. వైరల్ వీడియో.