ఈ ఇద్దరి చేతిలో దెబ్బలు తిన్న నాగార్జున.. పనులు చేయకపోతే అలా బిహేవ్ చేసేవారా?
TeluguStop.com
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు నాగార్జున.
అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్నారు.సీనియర్ హీరోలు అయినా చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లకు దీటుగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు.
ప్రారంభంలో యాక్షన్ సినిమాలు, ఆ తర్వాత లవ్ స్టోరీలు, భక్తిరస చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు చేసి మెప్పించారు.
అయితే రొమాంటిక్ మూవీస్ నాగ్ కి మంచి పేరుని తీసుకొచ్చాయి.గీతాంజలి,నిన్నే ప్రేమిస్తా, మన్మథుడు, సంతోషం లాంటి సినిమాలు నాగ్ కి ఎంత గుర్తింపుని తెచ్చి పెట్టాయో మనందరికీ తెలిసిందే.
ఇంతే కాకుండా లవర్ బాయ్ ఇమేజ్‌ని కూడా తెచ్చిపెట్టాయి.ఇకపోతే ప్రస్తుతం రజనీకాంత్, ధనుష్‌లతో కలిసి నటిస్తున్నారు.
అయితే ఏఎన్నార్( ANR ) ఫ్యామిలీలో నాగ్ ఒక్కడే హీరోగా నిలబడ్డాడు.అక్కినేనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
వీరిలో నాగార్జున చిన్నవారు.అన్న వెంకట్( Venkat ) సినిమాలు చేయలేదు.
నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు.కానీ అవి కూడా వదిలేశాడు.
ఇక అక్క సుశీలమ్మ( Susheelamma ) సైతం ప్రొడక్షన్ లో ఇన్‌వాల్వ్ అయ్యింది అన్న మాటే కానీ సక్సెస్ మాత్రం కాలేదు.
మిగిలిన అక్కలు సినిమాలకు దూరంగానే ఉన్నారు. """/" /
నాగ్ మాత్రమే అటు హీరోగా, నిర్మాతగా, బిజినెస్ మేన్‌గా సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు ఆయన వారసులు నాగచైతన్య, అఖిల్ కూడా హీరోలుగా రాణిస్తున్నారు.తాజాగా నాగార్జున తన చిన్నప్పటి విషయాలను పంచుకుంటూ.
స్కూలింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనే సాగింది.ఇంజనీరింగ్ వరకు ఇక్కడే చదువుకున్నాడు.
అయితే ఇక్కడ సరిగా మార్కులు రావడం లేదని చెప్పి, మెకానికల్ ఇంజనీరింగ్ కోసం యూఎస్ వెళ్లాడట.
ఆ తర్వాత నటుడిగా టర్న్ తీసుకున్నట్టు తెలిపారు.ఇదిలా ఉంటే తాను చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడట.
స్కూల్ లోనూ చాలా అల్లరి చేసేవాడిని అని, చాలా కంప్లెయింట్స్ ఉండేవని తెలిపారు.
ఇప్పటిలా సోషల్ మీడియా లేకపోవడంతో తమ ప్రైవసీకి ఇబ్బంది లేదని, తాను ఎవరో ఎవరికీ తెలిసేది కాదని, దీంతో ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని అని, అల్లరి పనులన్నీ చేసినట్టు తెలిపారు.
ఏది ఇంట్లో తెలిసేది కాదన్నారు.అంతేకాదు తన ఇంట్లోనే అంతే అని, నాన్న, అమ్మ ఉన్నంత సేపు చాలా సైలెంట్‌గా, రాముడు మంచి బాలుడు అనేలా ఉండేవాడిని అని, వాళ్లు వెళ్లిపోయాక తన విశ్వరూపం చూపించేవాడట.
"""/" /
అయితే ఇంట్లో అన్న, అక్క వెంకట్, సుశీల తనని వాళ్ల పనుల కోసం బాగా వాడుకునేవారట.
చేయకపోతే కొట్టేవాళ్లట.మాటలతో చెప్పడం ఉండేది కాదని, నో చెబితే దెబ్బలే పడేవని తెలిపారు నాగ్.
అయితే నాన్న వచ్చాక ఇలా కొట్టినట్టు వాళ్ల మీద కంప్లెయింట్ కూడా ఇచ్చేవాడట.
దీంతో నాన్న వాళ్లని తిట్టేవాడట.అయితే వాళ్లు వెళ్లిపోయాక, అమ్మా, నాన్నలతో తనకు డబుల్ కోటింగ్ ఉండేదని, ఇదేదో తనకే ముప్పుగా మారుతుందని చెప్పి కొన్నాళ్ల తర్వాత కంప్లెయింట్ ఇవ్వడమే మానేశా అని చెప్పారు నాగార్జున.
దాన్ని అన్న, అక్క క్యాష్ చేసుకుని తనని బాగా ఆడుకునేవాళ్లని తెలిపారు నాగార్జున.
తొలిసారి నెగిటివ్ రోల్ లో ప్రభాస్.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఆ రోల్ లో కనిపిస్తారా?