అక్కినేని సోగ్గాళ్ల 'బంగార్రాజు' ప్రివ్యూ

అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా విడుదల అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది.

సరిగ్గా అయిదేళ్ల క్రితం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్గా రూపొందిన బంగార్రాజు సినిమా మళ్లీ అదే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

రేపు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బంగార్రాజు సినిమా పై ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి నెలకొంది.

పెద్ద సినిమాలు పోటీగా లేకపోవడం వల్ల ఈజీగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాకు కొద్దిపాటి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అన్నట్లుగా మీడియా వర్గాల వారు కూడా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సోగ్గాడే చిన్నినాయన సినిమా కథకు కొనసాగింపుగా బంగార్రాజు సినిమా కథ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం లో మెప్పించాడు.బంగార్రాజు లో కూడా నాగార్జున ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్లు గా సమాచారం అందుతోంది.

ఇక నాగచైతన్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరిగింది.

నాగార్జున మరియు నాగ చైతన్య లు తాత మనవడు గా కనిపించబోతున్నారు.తాత అయిన బంగార్రాజు మనవడు అయిన బంగార్రాజు ని అదుపులో పెట్టడం కోసం స్వర్గం నుంచి కిందికి దిగి వస్తాడట.

ఎన్నో మలుపులు మరియు ట్విస్ట్ లు ఉండే ఈ కథ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు.

ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా రాబోతున్న బంగార్రాజు సినిమాకు భారీగా వసూళ్లు నమోదు అవుతాయా అనేది రేపటితో క్లారిటీ వచ్చేస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

"""/"/ నాగచైతన్య మరియు కృతి శెట్టి ల మధ్య రొమాన్స్ కచ్చితంగా ప్రతి ఒక్క సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది అంటూ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ కనిపించబోతుంది.ఇక ఈ సినిమాలో పలువురు హీరోయిన్స్ కూడా కనిపించబోతున్నారట.

స్వర్గంలో వచ్చే సన్నివేశాల లో.పాటలు మరియు ఐటమ్ సాంగ్స్ ఇలా పలు సందర్భాల్లో ముద్దుగుమ్మలు నాగార్జున మరియు నాగచైతన్యలతో సందడి చేస్తారట.

ఇవాళ మెదక్ లో సీఎం రేవంత్ పర్యటన.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీకి హాజరు