బంగార్రాజులో బ్రహ్మిని ఎందుకు తీసుకోలేదో చెప్పేసిన నాగ్!

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున, తనయుడు అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం బంగార్రాజు.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.నాగార్జున సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ.పెద్ద బంగార్రాజుగా నాగార్జున, చిన్న బంగార్రాజు గా చైతు కనిపించి సంక్రాంతి సోగాళ్ళు గా అభిమానులను అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని అనిపించుకున్నారు.

యమలోకం ఎపిసోడ్.ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అలాగే అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను అలరించింది.ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టి వావ్ అనిపించింది.

ఇక పండగ తర్వాత కూడా అదే జోరు చూపిస్తూ బంగార్రాజు దూసుకు పోతుంది.

ఇంకా ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

"""/"/ ఈ ఇంటర్వ్యూ లో నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు పాల్గొన్నారు.నాగార్జున మాట్లాడుతూ.

ఈ సినిమాలో నేను, చైతు కలిసి నటించాము.మాతో పాటు అఖిల్ కూడా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని అంత అడుగుతున్నారు.

అయితే అలా కలిసి నటించాలి అంటే అందుకు తగిన స్క్రిప్ట్ ఉండాలి.ఆ స్క్రిప్ట్ ముగ్గురికి సూట్ అవుతుంది అని అనిపించాలి.

అప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది.ఇక ఈ సినిమాలో బంగార్రాజు పాత్రను చైతు ని దృష్టిలో పెట్టుకుని చేయడం వల్ల అది అలరించింది.

అందరికి కనెక్ట్ అయ్యింది.సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బ్రహ్మానందం, అనసూయ వంటి చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు కనిపించరు.

సోగ్గాడే చిన్ని నాయన లో బ్రహ్మానందం గారు ఆత్మానందం పాత్రలో ఆడియెన్స్ ను ఫుల్ గా నవ్వించాడు.

"""/"/ అలా అని చెప్పేసి ఆయన పాత్రను మళ్ళీ పెట్టలేము.ఎందుకంటే ఇది తాత, మనవడి స్టోరీ.

అంటే మధ్యలో 30 ఏళ్ళు గడిచిపోయినందు వల్ల మళ్ళీ బ్రహ్మానందం గారిని తీసుకోవడం కుదరలేదు.

ఒకవేళ ఆయనను తీసుకుంటే అప్పుడు 85 ఏళ్ళకి పైబడిన స్టోరీ చూపించాల్సి వస్తుంది.

అందుకే తీసుకోలేదు అని నాగార్జున తెలిపారు.

గుజరాత్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి కారణం ఇదే…