నాగార్జున 100వ సినిమా.. డైరక్టర్ ఎవరు..?

కింగ్ నాగార్జున లెక్కకి 100 సినిమాలు దాటేసినా సరే అందులో ఆయన చిన్న చితకా పాత్రలు వేసినవి.

జస్ట్ కెమియో రోల్ గా కనిపించనవి ఉంటాయి.ఆయన లీడ్ రోల్ లో నటించి లేదా సపోర్ట్ అందించిన సినిమాల లెక్క ఇంకా వంద కాలేదు.

ఏ నటుడికైనా మైల్ స్టోన్ మూవీ చరిత్రలో మిగిలిపోవాలని ఉంటుంది.చిరు 150వ సినిమా.

బాలకృష్ణ 100వ సినిమా అలానే ప్లాన్ చేశారు.ఇక ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది.

నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ది ఘోస్ట్ సినిమా చేస్తున్నారు.

ఆ సినిమా తర్వాత మరో దర్శకుడికి సినిమా సైన్ చేశారు.ఈ రెండిటి తర్వాత నాగార్జున తన 100వ సినిమా ప్రకటిస్తారని తెలుస్తుంది.

అది కూడా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు డైరక్షన్ లో నాగార్జున సినిమా 100వ సినిమా ఉంటుందని అంటున్నారు.

రాఘవేంద్ర రావు డైరక్షన్ లో నాగార్జున అన్నమయ్య, శ్రీ రామదాసు సినిమాలు చేశారు.

ఆ రెండు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.అయితే ఆ తర్వాత తీసిన ఓం నమో వెంకటేశాయ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఇదిలాఉంటే నాగ్ తన 100వ సినిమా కూడా రాఘవేంద్ర రావు డైరక్షన్ లో చేయాలని ఫిక్స్ అయ్యారట.

అయితే ఎలాంటి కథతో సినిమా చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది.నాగ్ కెరియర్ లో ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు.

వైరల్ వీడియో: పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?