పాత స్మృతులను గుర్తు చేసుకున్న నగరి ఎమ్మెల్యే
TeluguStop.com
నగరి ఎమ్మెల్యే,ఏపీఐఐసి చైర్మన్ రోజా భీమిలి ఉత్సవంలో పాల్గొని సందడి చేశారు.ఈ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి,అలానే తన ప్రేమ సంగతులను అందరితో పంచుకున్నారు.
ఆదివారం జరిగిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటూ సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనగా.
ఈ సందర్భంగా పలువుర్ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన రోజా తన ప్రసంగం తో అందరిని ఆకట్టుకున్నారు.
అంతేకాకుండా భీమిలి బీచ్ తో తనకున్న అనుబంధాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.
చామంతి సినిమా కోసం ఇదే భీమిలి బీచ్‌లో ఏడాది పాటూ షూటింగ్ చేశామని భానుమతి, హీరో ప్రశాంత్, తాను ఏడాది ఇదే బీచ్‌లో ఉన్నామని తన సినిమా కెరీర్‌కు నాంది పలికింది ఇక్కడే అని భీమిలితో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.
"""/"/అంతేకాకుండా తన భర్త సెల్వమణితో ప్రేమ పుట్టింది కూడా ఇక్కడేనని, సెల్వమణి ఇక్కడే ఐ లవ్ యూ చెప్పడం.
ఆ తర్వాత 12 ఏళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతులను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.
అలానే ఏపీ సీఎం వై యస్ జగన్ పాలన పై కూడా రోజా ఈ సందర్భంగా స్పందించారు.
ఆయన పాలన సైరా అన్నట్లు గా ఉందని ఆమె కొనియాడారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ అభివృద్ధిలో దూసుకెళ్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు మిస్ చేసుకున్న 3 మంచి రీమేక్ సినిమాలు ఇవే.. ఏమైందంటే?