ఇసుకను వేడి చేస్తే బంగారం వస్తుందా.. ??
TeluguStop.com
మంత్రాలకు చింతకాయలను రాల్చవచ్చూ.మాయలు వస్తే రోగాలు కూడా తగ్గించవచ్చూ.
మోసం చేయడం వస్తే ఎవరినైనా ముంచేసి లక్షలు కొల్లగొట్టవచ్చని నిరూపించాడు ఓ వ్యక్తి.
లోకంలో ఏదైనా ఒక విషయాన్ని గుడ్దిగా నమ్మేవారు ఉంటే వారికి మంచికంటే చెడు ఎక్కువగా జరుగుతుంది.
ఇకపోతే ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందని ఓ కేటుగాడు నగల వ్యాపారిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్ర, పూణెలోని హదాస్ పూర్ కు చెందిన ఓ నగల వ్యాపారితో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి హఠాత్తుగా ఓ రోజు 4 కిలోల ఇసుక సంచిని తీసుకొచ్చి నగల వ్యాపారికి ఇచ్చాడట.
ఈ ఇసుక పశ్చిమ బెంగాల్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన ఇసుక దీన్ని వేడి చేస్తే బంగారం అవుతుందని నమ్మించాడట.
గొర్రె కసాయివాన్ని నమ్మినట్టుగా ఆ నగల వ్యాపారి నేరగాన్ని నమ్మి రూ.30 లక్షలు క్యాష్, రూ.
20 లక్షల విలువైన బంగారం.మొత్తం 50లక్షలు అతనికి ముట్టజెప్పాడట.
తర్వాత ఆ ఇసుకను వేడి చేసిన వ్యాపారికి బంగారం కాదు గానీ అంతకంటే ఇంకేదో కనిపించి ఉంటుంది.
దాంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు.నిందితుడి కోసం గాలిస్తున్నారట.
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?