బిగ్ బాస్ గంగవ్వకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన నాగమణికంఠ.. ఏంటంటే?
TeluguStop.com
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమం నుంచి ఏడవ వారంలో కంటెస్టెంట్ నాగమణికంఠ ( Nagamanikanta ) ఎలిమినేట్ అయ్యారు.
నిజానికి నాగ మణికంఠ సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ ఈయన సెల్ఫ్ ఎలిమినేషన్ కోరడంతో బిగ్ బాస్ ( Bigg Boss ) తనని హౌస్ నుంచి బయటకు పంపించారు.
ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన నాగ మణికంఠ ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన తన సెల్ఫ్ ఎలిమినేషన్ గురించి కీలక విషయాలు వెల్లడించారు.
నిజానికి తాను బిగ్ బాస్ విన్నర్ గా తిరిగి రావాలన్న ఉద్దేశంతోనే హౌస్ లోకి వెళ్ళాను కానీ ఆరోగ్యం సపోర్ట్ చేయలేదని తెలిపారు.
"""/" /
డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యమని భావించే తను సెల్ఫ్ ఎలిమినేషన్ కోరానని నాగ మణికంఠ తెలిపారు.
ఒకవేళ నేను హౌస్ లో చివరి వరకు కొనసాగి విజేతగా కనుక నిలిచి ఉంటే తప్పకుండా ఆ ప్రైజ్ మనీ మొత్తం హెచ్ఐవి బాధితుల కోసమే ఖర్చు చేసే వాడినని తెలిపారు.
ఓసారి ఆసుపత్రిలో హెచ్ఐవి తో బాధపడుతూ ఓ చిన్నారి మరణించడం నన్ను ఎంతగానో కలిసి వేసిందని నాగమణికంఠ తెలిపారు.
"""/" /
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ తాను హౌస్ లో కొనసాగుతున్న గంగవ్వ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ( A Surprise Gift )ప్లాన్ చేశానంటూ కూడా వెల్లడించారు.
మరి గంగవ్వ కోసం నాగమణికంఠ ఎలాంటి గిఫ్ట్ ప్లాన్ చేశారు అనే విషయానికి వస్తే.
గంగవ్వ బయటకు రాగానే తనకు అర్థతులం బంగారం కొనివ్వబోతున్నానని తెలియజేశారు.ఇలా గంగవ్వ కోసం ఈయన గిఫ్ట్ ప్లాన్ చేశానని చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక గంగవ్వ సీజన్ ఫోర్ కార్యక్రమంలో పాల్గొని ప్రస్తుతం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
పిరమిడ్స్ ఎలా కట్టారో వివరించిన ఎన్నారై రీసెర్చర్..?