అమ్మ చనిపోతే అంత్యక్రియలకు అడుక్కున్నాను.. మణికంఠ ఎమోషనల్ కామెంట్స్!
TeluguStop.com
బిగ్ బాస్ 8( Bigg Boss 8 ) కార్యక్రమం ప్రారంభమై నాలుగు రోజులు పూర్తి అయింది.
అయితే హౌస్ లో పెద్ద ఎత్తున కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఇక ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ కూడా ఇస్తున్నారు.
అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లలో చాలామంది కంటెంట్ నాగమణికంఠ( Nagamanikanta ) ను టార్గెట్ చేశారని తెలుస్తోంది.
నాగ మణికంఠ కూడా హౌస్ లో సింపతి డ్రామాలు ప్లే చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
"""/" /
ఇక బుధవారం నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగింది.ఈ నామినేషన్స్ లో భాగంగా పలువురు కంటెస్టెంట్లు నాగమణికంఠను టార్గెట్ చేశారు.
దీంతో విష్ణు ప్రియ( Vishnu Priya ) , శేఖర్ బాషా ( Sekhar Basha ) వంటి వారితో నాగ మణికంఠకు కాస్త వాగ్వాదం జరిగింది.
ఈ సమయంలోనే నాగమణికంఠ తన వ్యక్తిగత విషయాలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను.సవతి తండ్రి పెట్టే బాధలు దిగమింగుకున్నాను.
అమ్మ కూడా క్యాన్సర్ తో మరణించింది. """/" /
ఇలా చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడుతూ చావు అంచుల వరకు వెళ్లొచ్చానని చివరికి అమ్మ చనిపోతే ఆమె దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేకపోతే అమ్మ చితికి కట్టెలను ఏర్పాటు చేయడం కోసం కూడా డబ్బులను అడుక్కున్నాను అంటూ ఈయన ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఈ విధంగా నాగ మణికంఠ అమ్మ అంత్యక్రియలకు అడుక్కున్నాను అంటూ ఎమోషనల్ కావడంతో ఈయన మాటలకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు ఎమోషనల్ గా కనెక్ట్ కాగా మరి కొంతమంది నేటిజన్స్ అభిమానులను ఆకట్టుకోవడం కోసం ఇలాంటి సింపతి డ్రామాలు ప్లే చేస్తున్నారు అంటూ ఈయన పట్ల విమర్శలు చేస్తున్నారు.
ఇండియన్ అబ్బాయిలతో డేటింగ్ మాములుగా ఉండదు.. ఆస్ట్రేలియన్ మహిళ కామెంట్స్..