బీఆర్ఎస్ ప్రభుత్వంపై నాగం జనార్థన్ రెడ్డి విమర్శలు

బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.అసెంబ్లీలో పెట్టాల్సిన కాగ్ రిపోర్టును సీఎం కేసీఆర్ ను పక్కన పెట్టారని తెలిపారు.

సీఎం కేసీఆర్ దోపిడీపై వదిలిపెట్టేది లేదని నాగం జనార్థన్ రెడ్డి హెచ్చరించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

ప్రభుత్వ అవినీతిపై తేల్చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

దోచుకున్న డబ్బుతోనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ దోచుకుంటుందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెల్లడించారు.

కురుల ఆరోగ్యాన్ని పెంచే కాఫీ.. ఎలా వాడాలో తెలుసా?