సమంత దారి సమంతదే నా దారి నాదే.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు?

నాగచైతన్య సమంత విడిపోయి దాదాపుగా పది నెలలు అయింది.అయితే చైసామ్ గురించి ప్రతిరోజూ పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.

చైతన్య సమంత ఒకరి గురించి ఒకరు చిన్న విషయం గురించి ప్రస్తావించినా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

సమంత విషయంలో అక్కినేని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.ఛాన్స్ వస్తే సమంతను ట్రోల్ చేయడానికి అక్కినేని ఫ్యాన్స్ వెనుకాడటం లేదు.

అయితే వైరల్ అవుతున్న కథనాల వల్ల ఇబ్బంది పడుతున్న నాగచైతన్య మరోమారు సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఒక జాతీయ మీడియా సంస్థతో ముచ్చటించిన చైతన్య తన పర్సనల్ లైఫ్ గురించి అందరూ మాట్లాడుకోవడం అసహనాన్ని కలిగిస్తోందని వెల్లడించారు.

తాను నటుడినని తన నటనా జీవితం గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని నాగచైతన్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

"""/" / నా పర్సనల్ లైఫ్ గురించి చర్చ జరగడం నాకు అస్సలు నచ్చదని చైతన్య పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని వ్యక్తిగతం అని ఎందుకు చెబుతామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చైతన్య అభిప్రాయపడ్డారు.

నా మూవీ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ పెద్ద హెడ్ లైన్ గా మారిపోయిందని చైతన్య చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో నేను సాధించిన వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదని చైతన్య చెప్పుకొచ్చారు.

"""/" / ఇది నాకు చాలా చికాకును కలిగిస్తోందని చైతన్య అభిప్రాయపడ్డారు.బ్యాడ్ లక్ ఏంటంటే సినిమా రంగంలో నా పర్సనల్ లైఫ్ కూడా కథా వస్తువు అయిపోతుందని చైతన్య కామెంట్లు చేశారు.

సమంత దారి సమంతదే నా దారి నాదేనని చైతన్య స్పష్టం చేశారు.ఈ విషయానికి సంబంధించి ఇంతకుమించి చెప్పాల్సిన అవసరం లేదని చైతన్య చెప్పుకొచ్చారు.

చైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా ఈ నెలలో థియేటర్లలో విడుదలవుతోంది.

ఒళ్ళు బలిసి ఈ వీడియో పెట్టాను.. జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!