Naga Chaitanya : ఆ హీరోయిన్ కు లవ్ ప్రపోజ్ చేసిన నాగచైతన్య.. బుజ్జి తల్లీ కాస్త నవ్వవే అంటూ?
TeluguStop.com
నాగచైతన్య సాయిపల్లవి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ( Love Story ) బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
ఆ సినిమా సమయంలో ఈ జోడీ గురించి కొన్ని గాసిప్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి.
అయితే చైతన్య చందూ మొండేటి కాంబోలో సాయిపల్లవి హీరోయిన్ గా ప్రస్తుతం తండేల్ మూవీ తెరకెక్కుతోంది.
ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. """/" /
70 కోట్ల రూపాయలకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా చైతన్య సాయిపల్లవికి ప్రపోజ్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బుజ్జితల్లీ.వచ్చేస్తున్నా కదే.
కాస్త నవ్వవే.అంటూ చైతన్య ఇన్ స్టాగ్రామ్ నుంచి రిలీజైన వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
చైసామ్ జోడీ క్యూట్ గా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. """/" /
బుజ్జితల్లీ కాస్త నవ్వవే అంటూ నాగచైతన్య( Naga Chaitanya ) కామెంట్లు చేస్తున్న వీడియో నెటిజన్లను ఎంతగానో మెప్పిస్తోంది.
చైసామ్ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మరోవైపు చైతన్య వ్యక్తిగత జీవితం గురించి రూమర్లు మాత్రం ఆగడం లేదు.
చైతన్య రెండో పెళ్లి చేసుకుంటారని కొన్ని వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే చై ఫ్యాన్స్ మాత్రం ఆ వార్తలను నమ్మడం లేదు.తండేల్ మూవీ( Thandel ) చైతన్య సాయిపల్లవిలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తండేల్ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది.ఈ సినిమా విడుదలైన తర్వాతే చైతన్య కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటనలు రానున్నాయి.
చైసాయిపల్లవి జోడీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఇద్దరి అమ్మాయిలను సముద్రంలోకి లాగేసిన అలలు.. తర్వాత ఏమైందో చూడండి..