సాయి పల్లవికి కొత్త బిరుదు ఇచ్చిన చైతన్య.. ఏంటో తెలుసా?

నాగచైతన్య( Naga Chaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) జంటగా చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న తండేల్( Thandel ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఫిబ్రవరి ఏడో తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య నటి సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

అంతేకాకుండా సాయి పల్లవికి నాగచైతన్య సరికొత్త బిరుదును కూడా ఇచ్చారు. """/" / సాయి పల్లవికి ఇప్పటికే నేచురల్ బ్యూటీ, లేడీ పవర్ స్టార్ అనే బిరుదులు ఉన్నాయి.

సాయి పల్లవి సినిమా చేస్తోంది అంటే ఆ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి.

ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్నారు.ఈ క్రమంలోనే సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ అని నేచురల్ బ్యూటీ అంటూ కూడా పిలుస్తూ ఉంటారు.

తాజాగా ముద్దుగుమ్మకు నాగ చైతన్య మరో బిరుదును కూడా ఇచ్చారు. """/" / ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ మన బాక్సాఫీస్ క్వీన్( Boxoffice Queen ) సాయి పల్లవి అంటూ ఆమెకు సరికొత్త బిరుదును ఇచ్చారు.

సాయి పల్లవితో సినిమా చేయడం అంటే చాలా కష్టం ముఖ్యంగా ఆమెతో డాన్స్ చేయాలంటే నాకు కాస్త భయం అని అంత అద్భుతంగా పల్లవి డాన్స్ చేస్తుందని నాగచైతన్య తెలిపారు.

ఇక తండేల్  సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.ఈ సినిమా తన కెరియర్ లో ఎంతో ఇంపార్టెంట్ చిత్రమని నాగచైతన్య ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సాయి పల్లవి నాగచైతన్య ఇదివరకే లవ్ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమా సక్సెస్ తర్వాత నాగచైతన్య ఇప్పటివరకు హిట్ అందుకోలేదని చెప్పాలి.

ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు ఒక్క దెబ్బతోనే మాయం!