నిజాలు ఏంటో వారికి బాగా తెలుసు… నాగచైతన్య కామెంట్స్ వైరల్!

సినీ నటుడు అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సీరిస్ కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఈయన నటించిన దూత( Dootha ) అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈయనకు ఇది మొట్టమొదటి వెబ్ సిరీస్ కావడం విశేషం.ఈ వెబ్ సిరీస్ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఇలా ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య మరోసారి తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

"""/" / పెళ్లికి ముందు నాగచైతన్య గురించి పెద్దగా పట్టించుకోనే వారు కాదు.

ఎప్పుడైతే ఈయన సమంత ( Samantha )ను పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చారో అప్పటినుంచి చాలామంది నాగచైతన్య పర్సనల్ లైఫ్ పై కూడా ఫోకస్ పెట్టారు.

అయితే ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.నా వ్యక్తిగత జీవితం పై అందరూ ఫోకస్ పెట్టిన నాకు ఏ విధమైనటువంటి సమస్య లేదని తెలిపారు.

కానీ తన వర్క్ పరంగా తనని అందరూ గుర్తు పెట్టుకోవడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు.

ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత నేను దాని గురించి తిరిగి అసలు పట్టించుకోను ఈ విషయాలు నాకు చాలా క్లోజ్ గా ఉన్న వారికి మాత్రమే తెలుసు అంటూ ఈయన తెలిపారు.

"""/" / నా వ్యక్తిగత జీవితం ద్వారా నేను అందరికీ తెలియడం కంటే నా వృత్తిపరమైన జీవితం ద్వారా అందరూ నన్ను గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటాను.

అందుకే నేను నా పని పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను.ఇకపై నేను ఏ విషయాల గురించి మాట్లాడనని.

నా సినిమాలే మాట్లాడతాయని,నా సినిమాలు గొప్పగా ఉండి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే ప్రేక్షకులు నన్ను వాటి ద్వారానే గుర్తుపెట్టుకోవాలంటూ ఈ సందర్భంగా నాగచైతన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సింపుల్ మాస్క్ తో ఇంట్లోనే లాంగ్, సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను మీ సొంతం చేసుకోండి!