సమంతతో నాకు వర్క్ అవుట్ అవ్వలేదు.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు!
TeluguStop.com
సినీ నటుడు నాగచైతన్య( Nagachaitanya ) త్వరలోనే నటి శోభితతో( Sobhita ) కలిసి ఏడడుగులు నడవబోతున్నారు.
సమంతను( Samantha ) ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి శోభిత ప్రేమలో పడ్డారు.
ఇక వీరిద్దరూ డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో వివాహం (Wedding ) చేసుకోబోతున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకు తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
పెళ్లి గురించి నాగచైతన్య సమాధానం చెబుతూ.ఖచ్చితంగా చాలా ఉత్సాహం ఉంది, సీతాకోకచిలుకలు.
ఎక్కువ కాదు.వివాహ వేడుక మాకు ప్రత్యేకమైన , సెంటిమెంట్ ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతోంది.
"""/" /
మా తాత గారి విగ్రహం ముందు మా పెళ్లి జరిపించి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని మా కుటుంబ సభ్యులందరూ కూడా భావించాము.
మా రెండు కుటుంబాలు కలిసి ఈ వేడుకను నిర్వహించడం కోసం చాలా ఎదురు చూస్తున్నామని నాగచైతన్య తెలిపారు.
ఇక తాను శోభితతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి తనతో సంతోషంగా ఉండడం కోసం ఎదురుచూస్తున్నాను.
నేను ఆమెతో చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను ఆమె నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది.
నాలో ఖాళీని పూర్తి చేస్తుంది.మున్ముందు మాది అద్భుతమైన ప్రయాణం కానుంది.
శోభితతో నా పెళ్లి స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ నాగచైతన్య తెలిపారు.
"""/" /
ఇలా శోభితను పెళ్లి చేసుకోవడం పట్ల నాగచైతన్య ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది అభిమానులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.
అంటే ఇన్ని రోజులు మీరు సమంతతో అంత డీప్ గా కనెక్ట్ కాలేకపోయారా, శోభితతో వర్కౌట్ అయినంటూ సమంతతో వర్కౌట్ కాలేదా.
తను మిమ్మల్ని అర్థం చేసుకోలేక పోయిందా అంటూ విభిన్న రకాలుగా చైతన్య వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.
ఇక విడాకుల తర్వాత సమంత పూర్తిగా తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్.. ఆ కంటెస్టెంట్ బలి కావడం ఖాయమా?