నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగచైతన్యకు వరుస షాకులు తగులుతున్నాయి.థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలు వరుసగా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం నాగచైతన్య మార్కెట్ పై ప్రభావం చూపింది.

అయితే నాగచైతన్య తర్వాత సినిమాలు సక్సెస్ సాధించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి ప్రశ్నలు ఎదురు కాగా నాగచైతన్య ఆ ప్రశ్నల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నెపోటిజం ప్రభావం బాలీవుడ్ ఇండస్ట్రీతో పోల్చి చూస్తే సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించదని నాగచైతన్య తెలిపారు.

అసలు ఇది ఎందుకు మొదలైందో కూడా అర్థం కావడం లేదని నాగచైతన్య అన్నారు.

దీని గురించి నన్ను ఎప్పుడు అడిగినా నా అభిప్రాయం ఇదేనని చైతన్య చెప్పుకొచ్చారు.

మా తాత, మా నాన్న నటులే అని చైతన్య కామెంట్లు చేశారు.బాల్యం నుంచి వాళ్లను చూస్తూ పెరిగానని చైతన్య చెప్పుకొచ్చారు.

తాత, తండ్రి ప్రభావం నాపై కచ్చితంగా పడుతుంది కదా అని చైతన్య కామెంట్లు చేశారు.

తాత, తండ్రిని చూసి నేను కూడా నటుడిని కావాలని అనుకున్నానని చైతన్య వెల్లడించారు.

వాళ్లను స్పూర్తిగా తీసుకొని నటుడినయ్యానని వాళ్లు చూపించిన దారిలో నేను పని చేసుకుంటూ వెళుతున్నానని నాగచైతన్య చెప్పుకొచ్చారు.

ఈ ప్రయాణం అలాగే కొనసాగుతుందని నాగచైతన్య కామెంట్లు చేశారు. """/"/ నా సినిమా, బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడి సినిమా ఒకేరోజు థియేటర్లలో విడుదలై బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడి సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే అందరూ తననే ప్రశంసిస్తారని నాగచైతన్య చెప్పుకొచ్చారు.

సినిమా రంగంలో పోటీ అనేది సమానంగా ఉంటుందని నాగచైతన్య కామెంట్లు చేశారు.నాగచైతన్య ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా నాగచైతన్య క్రేజ్ పెరుగుతోంది.