చరణ్ హీరోయిన్ పై మనసు పడ్డ నాగచైతన్య.. నటించాలని ఉందంటూ?

అక్కినేని హీరో నాగచైతన్యకు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.నాగచైతన్య నటించిన సినిమాలలో హిట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఫ్లాపులు సైతం అదే స్థాయిలో ఉన్నాయి.

థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకునేలా నాగచైతన్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.

భవిష్యత్తులో బాలీవుడ్ లో హీరోగా నటించే అవకాశం వస్తే అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాలతో కలిసి నటించాలని ఉందని చైతన్య అన్నారు.

తాను నటించాలని అనుకుంటున్న హీరోయిన్లలో ఇంకా చాలామంది హీరోయిన్లు ఉన్నారని చైతన్య కామెంట్లు చేశారు.

ఆ హీరోయిన్లు అందరితో కలిసి పని చేయాలని ఉందని చైతన్య అన్నారు.ముఖ్యంగా అలియా భట్ నటన అంటే నాకు చాలా ఇష్టమని చైతన్య చెప్పుకొచ్చారు.

/br> అలియా భట్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని చైతన్య కామెంట్లు చేశారు.

చరణ్ హీరోయిన్ పై నాగచైతన్య మనసు పారేసుకున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మనం మూవీ హిందీలో రీమేక్ అయితే తన రోల్ లో ఎవరు నటిస్తే బాగుంటుందని చైతన్యకు ప్రశ్న ఎదురు కాగా రణ్‌బీర్ అని చైతన్య వెల్లడించడం గమనార్హం.

/br> """/" / ఆ తర్వాత సెలబ్రిటీ క్రష్ ఎవరనే ప్రశ్నకు చైతన్య స్పందిస్తూ మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ పేరును సమాధానంగా చెప్పుకొచ్చారు.

మరోవైపు లాల్ సింగ్ చడ్డా మూవీ ఫుల్ రన్ లో భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటివరకు ఈ సినిమా కేవలం 37.96 కోట్ల రూపాయల కలెక్షన్లను మాత్రమే సొంతం చేసుకోవడం గమనార్హం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే3, శుక్రవారం 2024