పెళ్ళి తరువాత మొదటసారి జంటగా శ్రీశైల మల్లన్న సన్నిధిలో చైతూ శోభిత!
TeluguStop.com
సినీనటుడు అక్కినేని నాగచైతన్య ( Nagachaitanya ) శోభిత ( Sobhita ) వివాహం డిసెంబర్ 4 వ తేదీ ఎంతో ఘనంగా జరిగింది.
ఇలా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో నాగచైతన్య వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక పెళ్లి తర్వాత మొదటిసారి చైతన్య శోభిత ఇద్దరు కూడా జంటగా శ్రీశైలంలో( Srisailam ) సందడి చేశారు.
నాగార్జునతో ( Nagarjuna ) పాటు వీరిద్దరు శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబిక ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. """/" /
ఇలా పెళ్లి తర్వాత నాగచైతన్య శోభిత ఇద్దరు జంటగా కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.
ఇక ఈ ఫోటోలలో వీరిద్దరూ ఎంతో సాంప్రదాయంగా కనిపించారు.నాగచైతన్య పట్టు పంచ తెలుపు చొక్కా ధరించి ఉండగా శోభిత మాత్రం పసుపు రంగు పట్టు చీరలు ధరించి ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.
పెళ్లి తర్వాత వీరిద్దరూ మొదటిసారి శ్రీశైలానికి రావడంతో భక్తులు భక్తులు కూడా వీరితో కలిసి ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు.
"""/" /
ఆలయంలోకి రాగానే పేద పండితులు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు.
స్వామి అమ్మవార్లకు నూతన దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.హైదరాబాద్ నుంచి నేరుగా కారులో శ్రీశైలం చేరుకున్నారు.
చాలా రోజుల నుంచి శ్రీశైలానికి రావాలని నాగార్జున భావించారట శ్రీశైలం దర్శనం ఎంతో సంతృప్తిని అనుభూతిని ఇచ్చిందని నాగార్జున
తెలిపారు.
ఇక సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ ఏడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థ జరగగా డిసెంబర్ 4వ తేదీ పెళ్లి చేసుకున్నారు సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈయన శోభిత ప్రేమలో పడ్డారు.
పలు సందర్భాలలో వీరిద్దరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ స్పందించలేదు కానీ ఏకంగా నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.
బాలయ్యను వదిలి వెళ్లడం ఇష్టం లేక ఏడ్చేసిన చిన్నారి.. అసలేం జరిగిందంటే?