ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదు.. మా జోలికొస్తే తాటతీస్తా: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు( Mega Brother Nagababu ) ఇటీవల కాలంలో చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.

అయితే తాజాగా ఈయన నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా( Committee Kurrallu Movie ) ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఎంత ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు ఇందులో భాగంగా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ,అడివి శేష్( Varun Tej, Sai Dharam Tej, Advi Shesh ) వంటి వారు పాల్గొని సందడి చేశారు.

ఇక నాగబాబు సైతం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. """/" / ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మెగా ఫ్యామిలీ( Mega Family ) గురించి విమర్శలు చేసే వారిపై నాగబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొంతమంది మాట మాట్లాడితే మెగా ఫ్యామిలీ అంటూ మా కుటుంబం పై పడి ఏడుస్తూ ఉంటారు.

ఇలా మాతోపాటు మరి కొంతమంది ఫ్యామిలీస్ పై పడి ఏడ్చే పనికిమాలిన వెధవలను చాలామందిని చూశాను.

మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు ఇండస్ట్రీ ఏమి మా అబ్బ సొత్తు కాదు మా తాత సొత్తు కాదు.

"""/" / ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరిది ఎవరికి టాలెంట్ ఉంటే వారు ఇక్కడికి వచ్చి వారి టాలెంట్ నిరూపించుకుంటారని నాగబాబు తెలిపారు అలా కాదని మా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం తాటతీస్తాను అంటూ ఈయన తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఈ సినిమాలో కూడా 11మంది కొత్తవాళ్లు నటించారు వారందరూ రేపు వారి టాలెంట్ ఆధారంగా ఏ స్థాయిలో ఉంటారో చెప్పలేమని నాగబాబు తెలిపారు.

ఇక ఇండస్ట్రీ అంటే మగవారు మాత్రమే కాదు అమ్మాయిలకు కూడా టాలెంట్ నిరూపించుకొని ఒక గొప్ప అవకాశం అని హీరోయిన్గా మాత్రమే కాకుండా టెక్నీషియన్లుగా కూడా అమ్మాయిలు ఇండస్ట్రీలో ఎదగాల్సిన అవసరం ఉంది.

ఆ వైపు చాలా లోటు గ్యాప్‌ ఉంది.ఆ వైపు కూడా దృష్టి పెట్టాలి.

ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటే ఆగకుండా మీరేంటో చూపించండి అంటు నాగబాబు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నాకు యాక్టింగ్ రాదు.. అందుకే శరీరం చూపించా.. పూజాబేడీ సంచలన వ్యాఖ్యలు!