జబర్దస్త్ కు తిరిగి వెళ్లడానికి సిద్ధమని చెప్పిన నాగబాబు.. ఇగో లేదని చెబుతూ?

ప్రముఖ నటుడు నాగబాబుకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ పోసాని కృష్ణమురళి పేరు నోటితో మాట్లాడి నోరు పాడు చేసుకోవాలని అనుకోవడం లేదని తెలిపారు.

సాయితేజ్ కు యాక్సిడెంట్ అయిన సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లామని నాగబాబు అన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లలో చేతకాని ప్రెసిడెంట్ నరేష్ అని నాగబాబు పేర్కొన్నారు.

మా అసోసియేషన్ కు నరేష్ మైనస్ అయ్యారని నాగబాబు చెప్పుకొచ్చారు.నరేష్ వల్లే విష్ణు ఎన్నికల్లో పోటీ చేశాడని నాగబాబు తెలిపారు.

నరేష్ తన గురించి తాను గొప్పగా ఊహించుకుంటాడని నాగబాబు పేర్కొన్నారు.మా అసోసియేషన్ మసకబారడానికి కారణం నరేష్ అని నాగబాబు చెప్పుకొచ్చారు.

తన ప్యానల్ లో ఉండే సభ్యులతో కూడా నరేష్ కు సఖ్యత లేదని నాగబాబు కామెంట్లు చేయడం గమనార్హం.

"""/"/ మా అసోసియేషన్ ఎలక్షన్స్ కు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదని నాగబాబు అన్నారు.

జబర్దస్త్ షో కుర్రాళ్లు వచ్చి నన్ను జబర్దస్త్ కు రావాలని అడిగారని ఇతర షోలు చెయ్యడం లేదు కాబట్టి మళ్లీ వస్తానని చెప్పానని నాగబాబు కామెంట్లు చేశారు.

నాకు ఎటువంటి ఇగో ప్రాబ్లమ్ లేదని చెప్పానని నాగబాబు చెప్పుకొచ్చారు.మల్లెమాల వాళ్లు, ఈటీవీ వాళ్లు ఒప్పుకుంటే వస్తానని నాగబాబు పేర్కొన్నారు.

గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని జబర్దస్త్ షోకు వెళ్లడానికి నాకు ఎలాంటి సమస్య లేదని ఆయన పేర్కొన్నారు.

నాగబాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాగబాబు నిజంగానే జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

నాగబాబు ఎంట్రీ ఇస్తే జబర్దస్త్ షో రేంజ్ కచ్చితంగా పెరుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.