ఎన్ని విభేదాలు వచ్చిన మా బంధం ప్రత్యేకం… నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్!
TeluguStop.com
మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) నవంబర్ 1న వివాహంతో ఒక్కటయ్యారు.
ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ, ఇరు కుటుంబాలు, పలువురు సినీ ప్రముఖుల మధ్య ఇటలీలో ఎంతో ఘనంగా జరిగింది.
ఇక ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా మెగా బ్రదర్స్ ముగ్గురు కూడా ఒకే ప్రేమ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ ఫోటోని మెగా బ్రదర్ నాగబాబు ( Nagababu ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
"""/" /
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చిరంజీవి( Chiranjeevi ) నాగబాబు ముగ్గురు ఉన్న ఈ ఫోటోని ఈయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.
మా మధ్య ఎన్ని విభేదాలు, వాదనలు తరచూ వస్తున్నప్పటికీ మా బంధం మాత్రం ఎప్పటికి ప్రత్యేకంగా ఉంటుంది.
మేము చేసిన పనులు, మా జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా మధ్య ఏర్పడే విభేదాల కంటే మా అనుబంధం ఎంతో ముఖ్యమైనది.
మా రిలేషన్ షిప్ ఎన్నో మంచి క్షణాలపై ఆధారపడి ఉంది.మా మధ్య రిలేషన్ నిజంగా చాలా బలమైనది, విడదీయలేనిది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు .
"""/" /
ఈ విధంగా ఈ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా అన్నదమ్ముల మధ్య అనుబంధం మాత్రం ఎప్పటికీ తగ్గదు అంటూ ఈ సందర్భంగా వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి నాగబాబు తెలియజేస్తూ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీలో ఎంతో సందడి చేస్తూ ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు.
అయితే నవంబర్ 5వ తేదీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహ రిసెప్షన్ హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరగబోతున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే వీరంతా తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు.
ఇక ఇక్కడ కూడా సినీ సెలబ్రిటీలు అందరినీ కూడా ఈ వివాహ రిసెప్షన్ కి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
యూఏఈలోని ఎన్ఆర్ఐలకు అలర్ట్ .. పాస్‌పోర్ట్ రెన్యూవల్ గైడ్‌లైన్స్ చూశారా?