అల్లు అర్జున్ పై నాగబాబు షాకింగ్ కామెంట్స్… తప్పు తెలుసుకున్నారా?
TeluguStop.com
మెగా బ్రదర్ నాగబాబు ( Nagababu ) ప్రస్తుతం ఒకవైపు రాజకీయ పనులలో బిజీగా ఉంటున్నా మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కూడా బిజీగా ఉన్నారు.
అయితే ఇటీవల కాలంలో ఈయన తన దృష్టి మొత్తం రాజకీయాల( Politics )పైనే పెట్టారు.
ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) డిప్యూటీ సీఎం అయిన తర్వాత మంగళగిరిలోనే ఉంటూ పిఠాపురం నియోజకవర్గ సమస్యలను తెలుసుకోవడం వాటికి పరిష్కారాలు అలాగే ఎప్పటికప్పుడు జనసేన కార్యకర్తలతో సమావేశాలు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
"""/" /
ఇలా గత కొంతకాలంగా ఏ మాత్రం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్న నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
అయితే ఎక్కువ శాతం మంది పవన్ కళ్యాణ్ గురించి వారి ఫ్యామిలీ గురించి ప్రశ్నలు వేశారు.
ఇక మరి కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ ( Allu Arjun ) తో వివాదం గురించి కూడా నాగబాబును ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టారు.
ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తాయి.
"""/" /
అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ నాగబాబు పరోక్షంగా శత్రువులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే అంటూ కూడా పోస్ట్ చేశాడు.
అలాగే సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ అన్ ఫాలో కూడా చేశారు.
దీంతో ఈ కుటుంబాల మధ్య భారీ స్థాయిలో వివాదాలు నడుస్తున్నాయని స్పష్టంగా అర్థమైంది.
అయితే తాజాగా అల్లు అర్జున్ గురించి నాగబాబును ప్రశ్నిస్తూ.అల్లు అర్జున్ సంగతేంటి బాబాయ్ అంటూ ఒక నెటిజన్ ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు నాగబాబు సమాధానం చెబుతూ పుష్ప 2 సినిమా కోసం వెయిటింగ్ అని చెప్పారు.
అలాగే అల్లు అర్జున్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెబుతారనే ప్రశ్న కూడా వేశారు.
ఈ ప్రశ్నకు నాగబాబు సమాధానం చెబుతూ హార్డ్ వర్కింగ్ అంటూ ఒక ప్రశ్నలో సమాధానం చేశారు.
ఇలా అల్లు అర్జున్ గురించి నాగబాబు ఇంత పాజిటివ్ గా మాట్లాడటంతో ఆయన తప్పు తెలుసుకున్నారా అందుకే ఇలా తప్పును సరిదిద్దుకుంటున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చైనాలో విజువల్ వండర్.. మల్టీ-లెవెల్ సిటీ చూస్తే మతిపోతుంది..