ఇండస్ట్రీకి నంబర్‌వన్‌ హీరో అవుతానని ఛాలెంజ్ చేసిన చిరంజీవి.. ఏమైందంటే?

మనలో చాలామంది లైఫ్ లో ఉన్నతస్థాయికి ఎదగాలని అనుకుంటారు.కొంతమంది విషయంలో ఉన్నతస్థాయికి ఎదగడం సాధ్యం అయితే మరి కొందరి విషయంలో మాత్రం సాధ్యం కాదు.

మెగాస్టార్‌ బర్త్‌డే కార్నివాల్‌ వేదికపై నాగబాబు మాట్లాడుతూ చిరంజీవికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చిరంజీవి 21 సంవత్సరాల వయస్సులో అద్దె గదిలో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉండేవారని నాగబాబు అన్నారు.

అప్పట్లో మాకు తాతలు పంచిన ఆస్తి లేదని నాగబాబు కామెంట్లు చేశారు.మా నాన్న ఎక్సైజ్ డిపార్టుమెంట్ లో సాధారణ జీతానికి పని చేసేవారని ఆయన నెల జీతం నుంచి నెలకు 200 రూపాయలు పంపిస్తే ఫిల్మ్ స్కూల్ లో చేరి మా అన్నయ్య జీవనం సాగించారని నాగబాబు అన్నారు.

మా అన్నయ్య ఉండే గది పక్కనే పూర్ణ పిక్చర్స్ ఆఫీస్ ఉండేదని ఆ సంస్థ మేనేజర్ సుబ్రహ్మణ్యం, ఆయన భార్య చిరంజీవిని బిడ్డలా చూసుకునేవారని నాగబాబు అన్నారు.

ఒకరోజు చిరంజీవిని, చిరంజీవి స్నేహితులను ప్రివ్యూ చూడమని థియేటర్ లో కూర్చోబెట్టారని అయితే హీరో, హీరో తాలూకు మనుషులు సీట్లు ఖాళీ లేకపోవడం వల్ల చిరంజీవి, ఆయన స్నేహితులను లేపి వెనుక నిలబెట్టారని నాగబాబు తెలిపారు.

ఆ తర్వాత సుబ్రహ్మణ్యం భార్య సినిమా ఎలా ఉందో చెప్పాలని చిరంజీవిని తన కొడుకు సూర్య ద్వారా అడగగా చిరంజీవి తనకు జరిగిన అవమానం గురించి చెప్పి ఈ ఇండస్ట్రీకి నంబర్ వన్ హీరో కాకపోతే నన్ను అడగండి అని చిరంజీవి బదులిచ్చారని నాగబాబు చెప్పుకొచ్చారు.

"""/"/ అలా ఛాలెంజ్ చేసిన చిరంజీవి తర్వాత రోజుల్లో నంబర్ వన్ హీరో కావడం ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

ఇతర భాషల్లో కూడా చిరంజీవి నటించిన సినిమాలు సక్సెస్ సాధించాయి.మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి విజయాలను సొంతం చేసుకున్నారు.

మెగా హీరోలకు రోజురోజుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

యూకేలో 80 ఏళ్ల భారత సంతతి వృద్ధుడి హత్య.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలిక