ఆ విషయంలో నాగబాబు మాట నిజమైతే పవన్ పరిస్థితేంటి..?

తెలంగాణ (Telangana) లో ఎన్నికల హడావిడి ముగిశాక ఆంధ్రాలో ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది.

ఇక అక్కడ అధికారంలో ఉన్న వైసిపి పార్టీ మళ్ళీ ఎలాగైనా గెలవాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

అలాగే ప్రతిపక్షంలో ఉన్న టిడిపి (TDP) పార్టీ ఈసారి వైయస్సార్ పార్టీని ఎలాగైనా ఓడించాలనే కసితో ఉన్నారు.

ఇక టిడిపి పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తో పాటు జనసేనలో పవన్ అన్నయ్య నాగబాబు కూడా యాక్టివ్ అయ్యారు.

ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆయన కూడా సభలు సమావేశాలు అంటూ తిరుగుతున్నారు.

అయితే తాజాగా నాగబాబు చేసిన కామెంట్లు రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.అంతేకాదు ఆయన చెప్పినట్టే జరిగితే పవన్ పరిస్థితి ఏంటి అని ఈ విషయం తెలిసిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక నాగబాబు ఈసారి వైఎస్ఆర్ పార్టీకి 25 సీట్లు కూడా రావని కచ్చితంగా జనసేన టిడిపి కూటమికి 150 సీట్లు వస్తాయని తేల్చి చెప్పారు.

ఇక నాగబాబు (Nagababu) చెప్పినట్లే చూసుకుంటే టిడిపి తో పొత్తు పెట్టుకున్న జనసేనకి చంద్రబాబు నాయుడు 30 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వడు.

ఒకవేళ ఇచ్చినా కూడా సరైన అభ్యర్థులు లేక ఓడిపోతాడు అనే భయం ఉంది.

భయం ఏమో కానీ చంద్రబాబు నాయుడు 30 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వడు అనేది జగమెరిగిన సత్యం.

ఈ లెక్కన నాగబాబు చెప్పినట్లు టిడిపి జనసేన కూటమి 150 సీట్లు గెలిస్తే అందులో జనసేన 30 సీట్లు పక్కన పెడితే 120 సీట్లు టిడిపికి వస్తాయి అన్నట్లు నాగబాబు మాట్లాడారు.

"""/" / ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా పార్టీ అధికారంలోకి రావడానికి 88 సీట్లు చాలు.

ఇక టిడిపికే 120 సీట్లు వస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు (Chandrababu Naidu) పక్కన పెడతారు.

అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సీట్లు తమ దగ్గర లేకుండా టిడిపి పార్టీ తమ పార్టీపై ఆధారపడాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు.

తమ పార్టీ సీట్లను ఆశించి తాము గెలిచిన సీట్లు వారికి ఇస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా టిడిపి పార్టీ ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు.

"""/" / కానీ ఇలాంటి తరుణంలో నాగబాబు 150 సీట్లు టిడిపి జనసేన కూటమి గెలుస్తుంది అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

ఇక ఈ విషయంలో నాగబాబు చెప్పినట్లే 150 సీట్లు జనసేన టిడిపి కూటమి గనుక గెలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బతుకు బస్టాండ్ అని పవన్ ని చంద్రబాబు పక్కన పెట్టడం ఖాయం అని, అప్పుడు పవన్ పరిస్థితి ఏంటి అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరి చూడాలి ఈ విషయంలో నాగబాబు చెప్పిన జోస్యం ఎంతవరకు నిజమవుతుందో.

పుష్ప2 లో ఆ సీన్ వల్ల నరకం చూసిన అల్లు అర్జున్.. వామ్మో ఇంత కష్టపడ్డారా?