Nagababu : నాగబాబు పొలిటికల్ కామెంట్స్ ..వరుణ్ సినిమా పై ఎఫెక్ట్ పడనున్నాయా?
TeluguStop.com
మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) ఇటీవల తన కుమారుడు వరుణ్ తేజ్( Varun Tej ) నటించిన ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా వేదికను కాస్త నాగబాబు పొలిటికల్ ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ వేదికపై నాగబాబు మాట్లాడటంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పేరును ప్రస్తావనకు తీసుకువచ్చారు.
దీంతో అక్కడ ఉన్నటువంటి అభిమానులు అందరూ సీఎం అంటూ పెద్ద ఎత్తున గోల చేశారు.
"""/" /
ఇలా సినిమా మీటింగుకు వచ్చి రాజకీయాల గురించి ప్రస్తావనకు తీసుకురావడం భావ్యం కాదు కానీ పవన్ కళ్యాణ్ పేరు రావడంతో అభిమానులు సీఎం అంటూ అరిచారు.
అయితే నాగబాబు వీరిని ఆపే ప్రయత్నం చేయకుండా వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
అరవండి ఇంకా బాగా అరవండి మీరు అరిస్తే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి అంటూ అభిమానులను ప్రోత్సహించారు.
ఇలా పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు మాట్లాడుతూనే ఉన్న అభిమానులు అలాగే కేకలు వేస్తూ ఉన్నారు.
"""/" /
ఈ క్రమంలోనే అభిమానులను ఉద్దేశించి నాగబాబు మాట్లాడుతూ మన దేశాన్ని కాపాడటానికి సైనికులకు ఆయుధం కావాలి కానీ మీకు ఎలాంటి ఆయుధం అవసరం లేదు.
మీకు మీరే బలం మీ అభిమానాన్ని టిడిపి జనసేన కూటమిపై( TDP Janasena Alliance ) ఓట్ల రూపంలో చూపించండి అంటూ ఈయన ఈ సినిమా వేదికను కాస్త రాజకీయ ప్రచార కార్యక్రమాల కోసం ఉపయోగించారు.
దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో పలువురు ఈయన వ్యాఖ్యల ద్వారా వరుణ్ తేజ్ సినిమా ప్రమాదంలో పడుతుందేమోనని భావిస్తున్నారు.
గతంలో కూడా రిపబ్లిక్ సినిమా( Republic Movie ) విషయంలో ఇదే జరిగింది.
దీంతో మరోసారి అదే వరుణ్ సినిమాలో కూడా రిపీట్ అవుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
పవన్ వల్ల సినిమాలకు దూరమవుతున్నాను…నటి నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు!