విదేశాలకు వెళ్లిన నాగబాబు ఫ్యామిలీ… పెళ్లి పనుల కోసమే వెళ్లారా?
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) తమ్ముడిగా నాగబాబు( Nagababu )కూడా అందరికీ ఎంతో సుపరిచితమే.
నాగబాబు ఇండస్ట్రీలో నిర్మాతగా సహనటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ కార్యకలాపాలలో ఎంత బిజీగా ఉన్నారు.
ఇకపోతే ప్రస్తుతం నాగబాబు కుటుంబ సభ్యులు(Nagababu Family)వారి వృత్తిపరమైన జీవితాన్ని పక్కనపెట్టి కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లారు.
"""/" /
ఇలా నాగబాబు తన కూతురు కొడుకు భార్య నలుగురు కలిసి ఆఫ్రికా ( Africa )వెళ్ళినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోని వీరంతా సోషల్ మీడియా వేదికగా ఈ వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో నాగబాబు కుటుంబం సోషల్ మీడియా వార్తలలో నిలిచారు.నిహారిక విడాకుల విషయం కుటుంబ సభ్యులను కాస్త కృంగదీసిందని చెప్పాలి.
అయితే ఈ విషయాలన్నింటిని పక్కనపెట్టి నాగబాబు ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత ఇలా వెకేషన్ కి వెళ్లారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" /
ఇకపోతే ఈ విదేశీ పర్యటనలలో భాగంగా వరుణ్ తేజ్ వివాహ వేదికను ( Marriage Venue )కూడా ఫిక్స్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
అందులో భాగంగానే ఈ కుటుంబం విదేశీ పర్యటనలకు వెళ్లినట్టు సమాచారం.మరి కొద్ది రోజులలో వరుణ్ తేజ్( Varun Tej ) లావణ్య( Lavanya ) వివాహం జరగబోతుంది అన్న సంగతి మనకు తెలిసిందే.
వీరి వివాహం ఎక్కువగా విదేశాలలోనే చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు వరుణ్ తేజ్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఉన్నఫలంగా నాగబాబు కుటుంబం ఇలా విదేశీ పర్యటనలకు వెళ్లడంతో వివాహ వేదిక కోసం కూడా వీరు విదేశాలకు వెళ్లి ఉండవచ్చు అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.
పుష్ప2 మూవీ వల్ల గేమ్ ఛేంజర్ కు భారీ షాక్.. అక్కడ ఆ సంబరాలు లేనట్టే?