Naga Babu : అతని మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నాగబాబు?
TeluguStop.com
మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు( Konidela Nagababu ) గురించి మనందరికీ తెలిసిందే.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నాగబాబు పేరు మార్మోగిపోతుంది.తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉన్నారు నాగబాబు.
మరి ముఖ్యంగా జనసేన పార్టీ (
Janasena Party )విషయంలో వాదనలు ప్రతి వాదనలు చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా నిలుస్తున్నారు.
అదే స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలను సైతం ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి సోషల్ మీడియాలో నిలిచారు నాగబాబు.
తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక ట్వీట్ చేస్తూ ఉంటారు. """/" /
ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
నాగబాబు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ జన సైనికులకు, జనసేన నాయకుకు బాగా దగ్గర అయ్యారు.
జన సైనికులకు ఎటువంటి ప్రమాదం జరిగినా, ఆపద వచ్చిన ముందుంటారు నాగబాబు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక జనసేన నాయకుడిని, అంతకు మించి విరాభిమానిని కోల్పోయాం అంటూ బాధపడుతున్నాడు నాగబాబు.
అసలేం జరిగిందంటే.నానాజీ( Nanaji ) అనే వ్యక్తి జనసేన నాయకుడిగా, అంతకు మించి వీరాభిమానిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
"""/" /
తాజాగా నానాజీ అకాల మరణం పొందాడు.ఆ ఘటన నన్ను ఎంతో బాధించింది అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు నాగబాబు.
ఈ క్రమంలోనే తన ట్వీటర్ వేదికగా నానాజీ మృతిపై ఎమోషన్ పోస్ట్ షేర్ చేశాడు.
ఆ పోస్ట్ లో నాకెంతో ఆప్తులు, జనసేన నాయకులు, అంతకంటే ఎక్కువగా పార్టీకి, మాకు వీరాభిమాని అయిన నానాజీ గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చారు.ఇకపోతే మొన్నటి వరకు బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ఈ మధ్యకాలంలో రాజకీయాలలో పూర్తి యాక్టివ్గా కనిపిస్తున్నారు.
అంతేకాకుండా జనసేన పార్టీలకు సంబంధించిన సభలకు మీటింగ్లకు కూడా వెళ్తున్నారు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్… అతనికి ఏమీ తెలియదు… నిర్మాత సంచలన వ్యాఖ్యలు!