Chiranjeevi : నాగబాబు, పవన్ కళ్యాణ్‌ల కంటే అల్లు అరవింద్ మాటకే చిరంజీవి ఎక్కువ విలువ ఇస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖ( Surekha Konidala )ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

దాంతో ప్రస్తుత దిగ్గజ సినీ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి బావ బామ్మర్దులయ్యారు.

అల్లుడు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రభావం గల రెండు కుటుంబాలని చెప్పవచ్చు.

అయితే చిరంజీవి మెగాస్టార్ అయినా సరే ఇప్పటికీ అల్లు అరవింద్ మాట వింటాడనే టాక్ సినీ ఇండస్ట్రీలో సాగుతుంది.

మూవీ ఇండస్ట్రీలోనే కాకుండా బయట చిరంజీవి పై అల్లు అరవింద్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తుంటారు.

అన్నదమ్ముల కంటే ఎక్కువగా చిరంజీవి అల్లు అరవింద్ సలహాలనే కోరతాడని, అతని సలహాలే ఫాలో అవుతాడని అంటారు.

అయితే తాజాగా నాగబాబు ప్రజల్లో ఉన్నటువంటి ఈ అభిప్రాయాలను పటాపంచలు చేశాడు. """/" / మెగా బ్రదర్ నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

"చిరంజీవికి కెరీర్ కొత్తలోనే పెళ్లయింది.ఆ సమయంలో అరవింద్ గారు, అతని అడ్వైజర్స్ మా అన్నయ్యకు సలహాలు ఇవ్వడం జరిగేది.

నిజానికి అన్నయ్యకు చాలా వ్యవహారాల్లో మంచి సలహాలు ఇచ్చారు.కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌ తర్వాత అరవింద్ గారి సలహాలు మా అన్నయ్యకి అవసరం లేకుండా పోయాయి.

అయినను చాలామంది ఇప్పటికీ అరవింద్ గారి సలహాలను వింటూనే చిరంజీవి బతుకుతున్నాడని అభిప్రాయపడుతుంటారు.

వాస్తవమేంటంటే, మా అన్నయ్య సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు.ఏదైనా ఫిక్స్ అయితే ఎవరు చెప్పినా వినడు.

" అని చెప్పుకొచ్చాడు. """/" / ఇకపోతే పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కూడా చిన్నతనం నుంచే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు.

అవి రైట్ అయినా లేదంటే రాంగ్ అయినా భయపడకుండా ముందుకు కదలడం పవన్ నైజం.

నాగబాబు కూడా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తుంటాడు.ఒకరు చెప్పినట్లు వినకుండా తమ సొంతంగా లైఫ్ ఫేస్ చేయగల సామర్థ్యం ఈ మెగా హీరోలకు ఉందని చెప్పవచ్చు.

కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల ఫెయిల్ అయినా సరే మళ్లీ తమ కాళ్లపై తాము నిలబడగల సత్తా వీరికి ఉంది.

ఇకపోతే ప్రస్తుతం పవన్ సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.చిరంజీవి కూడా మంచి హిట్ ఇచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తున్నాడు.

వారికి వైసీపీలోకి రీ ఎంట్రీ లేనట్టేనా ?