ఆఫ్టరాల్ రూ.1,500 అంటూ నాగవంశీ తలతిక్క వ్యాఖ్యలు.. బుద్ధి చెబుతున్న నెటిజన్లు..!

భారతదేశంలో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది.హంగర్ ఇండెక్స్‌లో మన ఇండియా అన్ని విశాల కంటే దిగివ స్థాయికి పడిపోయింది.

పొరుగు దేశాల్లో కంటే ఇండియాలోనే ఎక్కువ మంది ఆకలితో బాధపడుతున్నారని హంగర్ ఇండెక్స్ ఇటీవల వెల్లడించింది.

నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో అన్ని నిత్యవసర సరఫరాదారులు పెరిగిపోయాయి.పేదవారు మాత్రమే కాకుండా మధ్య తరగతి వారు కూడా చాలీ చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి సమయంలో ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ చాలామందికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ఈయన ఇటీవల ఒక కుటుంబం ప్రతి సినిమాపై రూ.1,500 ఖర్చు చేయలేదా అంటూ బలుపుగా వ్యాఖ్యలు చేశాడు.

మాల్‌కు వెళ్తే అయ్యే ఖర్చుకన్నా సినిమాకి అయ్యే ఖర్చు తక్కువ కదా అంటూ మూర్ఖపు వ్యాఖ్యలు చేశాడు.

నాగ వంశీ ( Naga Vamsi )చేసిన ఈ కామెంట్లను ఎవరూ పాజిటివ్‌గా తీసుకోలేకపోతున్నారు.

ఈ రోజుల్లో సినిమా టికెట్ల ధరలు మండిపోతున్నాయి.ఇక ఏదైనా స్నాక్స్ తినాలంటే జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొన్నది.

ట్రాన్స్‌పోర్ట్, పార్కింగ్( Transport, Parking ) ఇలా అనేక ఖర్చులు ప్రేక్షకుడిని నిలువు దోపిడీ చేస్తున్నాయి.

ఇంత ఖర్చు పెట్టుకుని సినిమా చూద్దామనుకున్నా ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది.ఎందుకంటే రొటీన్ లేదంటే కిచిడి చేసిన కథలతో సినిమాలు వస్తున్నాయి.

హీరో ఎలివేషన్లు, ఏమాత్రం వినోదాన్ని పంచని ఫైట్లు, పిచ్చి గెంతులు, బూతులు, ఎక్స్‌పోజింగ్‌లు ఇవన్నీ కూడా ప్రేక్షకులకు తలనొప్పులు తీసుకొస్తున్నాయి.

ఇలాంటి "ఒక్కో సినిమాకు ఆఫ్టరాల్ రూ.1,500 ఖర్చు పెట్టలేరా" అని నాగ వంశీ అడగడం ఆయన మూర్ఖత్వానికి ఒక నిదర్శనం అని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.

"""/" / ప్రభుత్వాలు కూడా ప్రజలను దోచేసేలాగా అడ్డగోలుగా టికెట్లు పెంచుకోవడానికి అనుమతులను ఇస్తున్నాయి.

ఇష్టమొచ్చినన్ని షోలు, ప్రీమియం షోలు వేసుకోమని కూడా పర్మిషన్లు ఇస్తున్నాయి."ఒకవేళ ప్రేక్షకులను కష్టపడి సంపాదించిన డబ్బును సినిమాలపై ఖర్చు చేశారని అనుకుందాం.

వాటితో హీరోలు వందల, వేల కోట్లు వెనకేసుకుంటున్నారు.వాటినే ఉపయోగించి రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా డబ్బులు దోచుకుంటున్నారు.

ఇక్కడ వారు ప్రజలని ఉద్ధరించేది ఏమీ లేదు" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

"""/" / సినిమా రివ్యూలు రాసే వారు కూడా "పర్లేదు ఒకసారి చూడొచ్చు" అని తీర్పులు చెప్పేస్తున్నారు కానీ ఆ ఒక్కసారి సినిమా చూడాలంటేనే మధ్య తరగతి ప్రజలపై చాలా భారం పడుతోంది.

థియేటర్లలో ఈ సినిమాలను చూడటం కంటే ఆ రూ.1,500 నెల నెలా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలా పెద్ద ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వచ్చు.

ఈ రూ.1,500తోనే కొన్నేళ్లపాటు సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేస్తే వారి తలరాతే బాగుపడొచ్చు.

సో ఇక్కడ రూ.1,500 అనేది మధ్య తరగతి ప్రజలకు ఎప్పుడూ ఆఫ్టరాల్ కాదు.

ఈ విషయాన్ని సూర్యదేవర నాగవంశీ గుర్తించాల్సిన అవసరం ఉంది.

అమెరికాలోని ఆ ప్రాంతంలో ఏలియన్స్ నివసిస్తున్నాయా.. షాకింగ్ ట్రూత్ రివీల్డ్‌..?