'గే' గా నాగ శౌర్య నటించిన 'నర్తనశాల' హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ... రేటింగ్.!!

H3Movie Title; నర్తనశాల/h3 H3Cast & Crew:/h3 న‌టీన‌టులు: నాగశౌర్య,కశ్మీర పరదేశి,యామిని భాస్కర్,శివాజీరాజా,జయప్రకాశ్‌రెడ్డి,అజయ్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ చక్రవర్తి నిర్మాత‌:ఉష మూల్పూరి (ఐరా క్రియేష‌న్స్) సంగీతం: మహతి స్వరసాగర్ H3STORY:/h3 దాదాపుగా అన్ని సినిమాలకు లాగే ఫ్ల్యాష్ బ్యాక్ తో సినిమా మొదలైంది.

శివాజీరాజా కూతురు కావాలని కోరుకుంటాడు.కానీ కొడుకు పుడతాడు.

కొడుకునే ఆడపిల్లలా పెంచుతాడు.అంటే జుట్టు పెద్దగా… ఆడపిల్లల బట్టలు వేసి ఆనాండిచటం అలాగనమాట.

కట్ చేస్తే పెద్దవాడైన తరువాత నాగాశౌర్య మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ నడుపుతూంటాడు.

ఇంటర్వల్ తరువాత నాగాశౌర్య యామినీ ఇంట్లో అడుగు పెట్టాడు.ఇప్పుడే కాశ్మీర కూడా యామినీ ఇంట్లో అడుగు పెడుతుంది.

ఆ తర్వాత ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3REVIEW:/h3 కామెడీ కోసం ‘నాగశౌర్య అండ్ కో’ చేసిన ప్రయత్నాలు మాత్రమే తెరపై కనపడ్డాయి గానీ, హాస్యం పండలేదన్నది సినిమా ఫస్ట్ టాక్.

ఇంటర్వెల్ కు రివీల్ అయిన ‘గే’ ట్విస్ట్ నుండి అయినా సినిమా గమనం మారుతుందని భావిస్తే అది కూడా అత్యాశగానే మారడం ప్రేక్షకులకు ఏ మాత్రం ఊరటనివ్వలేదు.

దర్శకుడిగా శ్రీనివాస్ చక్రవర్తి పూర్తి వైఫల్యం ఈ సినిమాలో కనపడుతుంది.హాస్యానికి స్కోప్ ఉన్న స్క్రిప్ట్ ను డీల్ చేయడంలో విఫలమైన దర్శకుడు, ఏ యాంగిల్ లోనూ సినీ ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయారు.

ఫస్ట్ హాఫ్ లో ఒక రెండు పాటలు మినహాయిస్తే….సినిమా అంతా నార్మల్ గానే రన్ అయ్యింది.

శివాజారాజా పై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు అంతగా పండలేదు.అజయ్ నాగాశౌర్య మధ్య గే కామెడీ కొంత పరవాలేదనిపించింది.

డైరెక్టర్ ప్రతి ఫ్రేమ్ లోను కామెడీ చూపించే ప్రయత్నం చేసాడు.మొదటి సగంలో వచ్చే రెండు పాటలు… అలాగే ఇద్దరు హీరోయిన్స్ తో “మ్యాచ్ కుదిరింది” సాంగ్ ఈ సినిమాకు హైలైట్.

H3Plus Points:/h3 సాంగ్స్ కామెడీ గే గా నాగశౌర్య యాక్టింగ్ శివాజీరాజా రోల్ హీరోయిన్స్ H3Minus Points:/h3 సెకండ్ హాఫ్ స్లో గా సాగే కథ కామెడీ పండించే ప్రయత్నం చేసారు కానీ చాలా సీన్లు విఫలమయ్యాయి కథలో బలం లేదు.

హాస్యంపైనే దృష్టిపెట్టారు H3Final Verdict:/h3 గే కామెడీ తో ముందుకొచ్చిన "నర్తనశాల"లో కామెడీ సీన్లపైనే డైరెక్టర్ దృష్టిపెట్టారు.

కానీ హాస్యం పండలేదు.ఒక్కమాటలో చెప్పాలంటే బోరింగ్ సినిమా.

వెళ్లకపోవడమే బెటర్.h3Rating: 2 / 5/h3 .

డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిందిగా…