ఇద్దరు కొడుకులని అందుకే ఇంటి నుంచి బయటకు పంపించి వేసాను : నాగశౌర్య తల్లి

హీరో నాగ శౌర్య ( Naga Shaurya )కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నాగశౌర్యకి ఒక అన్న ఉండగా అతడు అమెరికా లో సెటిల్ అయ్యాడు.అలాగే తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒంటరిగానే హైదరాబాదులో మరొక ఇంట్లో తన బార్య తో కలిసి నివసిస్తున్నాడు.

గత ఏడాది అనుష శెట్టి ( Anusha Shetty )అనే ఒక అమ్మాయితో నాగశౌర్య వివాహం అయింది.

నాగశౌర్య తల్లి ఉష( Usha ) తనకంటూ ఒక సొంత రెస్టారెంట్ బిజినెస్ ని నడిపిస్తూ చాలా సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త గా ఉండగా, ఇటీవల ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబంలోని అనేక విషయాలను పంచుకున్నారు.

"""/" / అయితే నాగశౌర్య తల్లి ఉష తనకు ఇద్దరు కొడుకులు( Sons ) పుట్టగానే వారికి పెళ్లిలు చేసి ఇంటి నుంచి బయటకు పంపించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారట.

అందుకు పెద్ద బలమైన కారణాలు ఏమీ లేవు కానీ దూరంగా ఉండి కలిసి ఉంటే బాగుంటుందని ఒకే చోట ఉండి కీచులాటలు ఆడుకునే బదులు ఎప్పుడో ఒకసారి కలిసి చక్కగా ఉండొచ్చనే ఆలోచనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.

పైగా ఎవరికి వారికి ఉద్యోగాలు వ్యాపారాలు( Jobs Are Businesses ) ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించిన టైమింగ్ కానీ పనులు కానీ వేరువేరుగా ఉంటాయి.

అందరూ ఒకే ఇంట్లో ఉండి ఒకరి టైమింగ్స్ తో మరొకరు ఇబ్బంది పడే బదులు ఎవరి ఫ్రీడం వారు తీసుకుంటే అందరికీ బాగుంటుంది అని అభిప్రాయంతో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందట.

"""/" / నాగశౌర్య అన్నా మరియు వదిన ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

నాగశౌర్య వదిన ఆపిల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా ఉండగా నాగశౌర్య భార్య ఇంటీరియర్ డిజైనర్ గా చాలా బిజీగా ఉందట.

బెంగళూరుకి హైదరాబాద్ కి ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ కొండాపూర్ లో ఉన్న తన తల్లిదండ్రులను కూడా చూసుకుంటూ నాగశౌర్యకు కావలసినవి అన్నీ కూడా సమకూరుస్తూ ఆమె బిజినెస్ ని కూడా చక్కగా సమర్థవంతంగా నెరవేరుస్తూ ఎప్పుడూ అలసిపోయినట్టుగా కూడా కనిపించదట అనూష శెట్టి.

ఉష మాట్లాడుతూ తన కోడలు ఇద్దరు కూడా ఎంతో సక్సెస్ఫుల్ మరియు అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉన్నవారు అంటూ గొప్పగా చెప్తుంది.

యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నిక .. భగవద్గీతపై సుహాస్ సుబ్రహ్మణ్యం ప్రమాణం