బెదురులంక 2012 సినిమాను రిజెక్ట్ చేసిన హీరో అతనేనా.. ఆ రీజన్ వల్లే సెట్ కాలేదా?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో,హీరోయిన్ లు రిజెక్ట్ చేసిన కథను మరొక హీరో, హీరోయిన్ లు చేయడం అన్నది కామన్.

అయితే కొన్ని సార్లు అదృష్టవశాత్తు అలా రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు ఆ సదరు హీరోలు ఆ సినిమా నేను ఎందుకు చేయలేదా అనే బాధపడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇప్పటికే బాగా ఎంతో మంది హీరోలు ఒక రిజెక్ట్ చేసిన సినిమాలను మరొకరు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెదురులంక సినిమా కూడా ఈ కోవ కి చెందుతుందని చెప్పవచ్చు.

"""/" / టాలీవుడ్ హీరో కార్తికేయ, నేహా శెట్టి( Karthikeya, Neha Shetty ) కలిసిన బెదురులంక ( Bedurulanka )సినిమా ముందుగా హీరో నాగ శౌర్య( Naga Shaurya ) దగ్గరకు వెళ్లిందట.

డైరెక్టర్ క్లాక్స్ ఈ కథ రాసిన తర్వాత మొదట నేరేషన్ ఇచ్చింది శౌర్యకేనట.

రెండు మూడేళ్లు శౌర్యతో ట్రావెల్ చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్ సెట్ అవ్వక చివరికి కార్తికేయను రీచ్ అయ్యాడట.

ఇక ఆర్ ఎక్స్ 100 తో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ( Karthikeya ) ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు.

రిజల్ట్స్ విషయం పక్కన పెడితే తను చేసిన ప్రతీ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది.

అందుకే కార్తికేయ క్లాక్స్ చెప్పిన ఈ ఇంట్రెస్టింగ్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఫైనల్ గా సినిమా చేశాడు.

"""/" / తొలి రోజు మిక్స్డ్ టాక్ తో ఓపెన్ అయిన బెదురులంక 2012 మెల్లగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.

ఈ సినిమాలో కామెడీ క్లిక్ అవ్వడంతో వీకెండ్ లో మంచి వసూళ్లు అందుకుంది.

పైగా వరుణ్ తేజ్ గాండీవ ధారి అర్జున డిజాస్టర్ అనిపించుకోవడం కూడా ఈ సినిమాకి కాస్త కలిసొచ్చింది.

రోజు రోజుకి వసూళ్లు పెంచుకుంటూ బెదురులంక 2012 హిట్ వైపు వెళ్తుంది.దీంతో ఇండస్ట్రీ నుండి కార్తికేయకి సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ చెప్తున్నారు.

ఏదేమైనా శౌర్య గొప్ప సినిమా మిస్ అయ్యాడని చెప్పలేం కానీ తను డెలివరీ చేస్తున్న డిజాస్టర్స్ తో పోలిస్తే బెదురులంక కాస్త బెటర్ మూవీ అయ్యేది.

కల్కి సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ..క్యారెక్టర్ ఏంటంటే..?