ముగించేసిన 'వరుడు కావలెను' షూట్ !

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.ఈయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం నాగ సౌర్య 'వరుడు కావలెను' సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ లో నాగ సౌర్య తన లుక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా మహిళా డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇందులో నాగ సౌర్య కు జోడీగా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

"""/" / కరోనా కారణంగా వాయిదా పడిన వరుడు కావలెను సినిమా ఈ మధ్యనే షూటింగ్ రీస్టార్ట్ చేసారు.

గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ కంప్లీట్ చేసేసారు.ఈ నేపథ్యంలో నాగ శౌర్య, రీతూ వర్మ, డైరెక్టర్ లక్ష్మి సౌజన్య తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు మేకర్స్.

ప్రేమ మరియు భావోద్వేగాలను మరింత నింపడానికి త్వరలోనే మీ ముందుకు వస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి వస్తున్న సాంగ్స్ కు మంచి స్పందన లభిస్తుంది.

ఈ మధ్యనే ఈ సినిమా నుండి వచ్చిన దిగు దిగు దిగు నాగ సాంగ్ బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ వినగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ ఇందులో మురళీ శర్మ, నదియా కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

"""/" / నాగ సౌర్య ఈ సినిమాతో పాటు లక్ష్య సినిమా కూడా చేస్తున్నాడు.

ఈ సినిమాను సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపు కుంటుంది.దీంతోపాటు పోలీస్ వారి హెచ్చరిక సినిమా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కూడా చేస్తున్నారు.

వైరల్ వీడియో: ఎంతకు తెగించార్ర బాబు.. భోజనాల కోసం ఏకంగా..