కాబోయే భార్య గురించి చెప్పిన నాగశౌర్య.. ఆమె తెలుగమ్మాయే అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ యంగ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలలో ఒకరైన నాగ శౌర్య గురించి మనందరికీ తెలిసిందే.
మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగ శౌర్య ఆ తర్వాత ఆ పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
నాగ శౌర్య నటించిన చలో సినిమాతో ప్రేక్షకులతో మరింత చేరువయ్యాడు.ఇక ఇది ఇలా ఉంటే నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి.
అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు అనగా సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి నిర్మించారు.
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
అయితే నాగేశౌర్య అభిమానులు పెళ్లి విషయంలో ఎప్పుడెప్పుడు శుభవార్త చెబుతారా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.పెళ్లి ఎప్పుడు అన్న వార్త పై స్పందించిన నాగశౌర్య ఈ ఏడాది నా పెళ్లి ఉండవచ్చు.
అంతేకాదు నేను చేసుకోబోయే అమ్మాయి తెలుగు వచ్చిన అమ్మాయి అని తెలిపారు నాకు శౌర్య.
"""/"/
ఈ వార్త విన్న నాగశౌర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే నాగశౌర్య మాటలు బట్టి చూస్తే ఆ తెలుగు అమ్మాయి ఎవరు ఆ అదృష్టవంతురాలు ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి నాగశౌర్య కూడా ఈ ఏడాది పూర్తి అయ్యే లోపు ఒక ఇంటివాడు కాబోతున్నాడు అన్నమాట.
సైబీరియన్ పులి ప్రేమ ప్రయాణం.. 200 కి.మీ దాటి, ప్రేయసి చెంతకు!