డిసెంబర్ 10న వస్తున్న నాగశౌర్య లక్ష్య..!

యువ హీరో నాగ శౌర్య లీడ్ రోల్ లో కెతిక శర్మ ఫీమేల్ లీడ్ గా వస్తున్న సినిమా లక్ష్య.

సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏసియన్ సినిమాస్ బ్యానర్ లో నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మారర్ నిర్మిస్తున్నారు.

పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారు.

నాగ శౌర్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని తెలిసిందే.సినిమాలో నాగ శౌర్య లుక్స్, స్టైల్ అదిరిపోతాయని తెలుస్తుంది.

రోమాంటిక్ సినిమాతో అలరించిన కెతిక శర్మ కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.

కొన్నాళ్లుగా రిలీజ్ కన్ ఫ్యూజన్ లో ఉన్న ఈ సినిమాను డిసెంబర్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారు.

డిసెంబర్ 17న పుష్ప సినిమా వస్తుండగా వారం ముందే లక్ష్య ప్రేక్షకుల ముందుకు రానుంది.

లక్ష్య సినిమా కోసం నాగ శౌర్య చాలా హోం వర్క్ చేశాడు.సినిమాలో నాగ శౌర్య సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించనున్నాడు.

సినిమాకు కాళ భైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.రీసెంట్ గా వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ శౌర్య లక్ష్యతో మరోసారి వారిని మెప్పించాలని చూస్తున్నాడు.

లండన్‌లో కంగనా పాటకు స్టెప్పులేసిన ఫారనర్స్‌.. వీడియో వైరల్..