సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?

ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్నాచితక పాత్రలు చేస్తూ వస్తున్న నాగ మహేష్ ఇటీవలి కాలంలో మాత్రం మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.

చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ అందరి సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు నాగ మహేష్.

ఇప్పటికే బాలకృష్ణ చిరంజీవి నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన నాగ మహేష్ అటు యువ హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు.

ఇక ఇటీవల కాలంలో అయితే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలు దక్కించుకుంటున్నారు నాగ మహేష్.

బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో నటించాడు నాగ మహేష్.

నాగార్జున హీరోగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బంగార్రాజు సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు.

ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగ మహేష్ నాగార్జున, బాలకృష్ణ లు తనతో ఎలా ఉండేవారు అనే విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

బంగార్రాజు సినిమాలో నాగార్జున నాగచైతన్యతో కలిసి సీన్స్ నాకు దొరకలేదు.ఎక్కువగా రావు రమేష్ తో కలిసి ఉన్న సీన్ లలో నటించాను అంటూ చెప్పుకొచ్చారు.

అయితే నాగార్జున గారు 60 ఏళ్లు దాటిన పోతున్న ఇంకా ఎంతో స్లిమ్ గా ఉన్నారని.

సెట్లో నాగచైతన్యను నాగార్జున గారిని పక్క పక్కనే చూస్తే అన్నదమ్ముల్లా కనిపించారని నాగ మహేష్ తెలిపాడు.

"""/" / అఖండ సినిమా చేస్తున్న సమయంలో బాలకృష్ణ గారిని ఎంతో దగ్గర నుంచి చూశాను.

ఆయన సెట్లో అందర్నీ కలుపు కుంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు.అయితే అటు నాగార్జున గారు మాత్రం ఎవరైనా మాట్లాడిస్తేనే మాట్లాడతారు తప్ప లేదంటే సైలెంట్ గా ఉండి పోతారు.

ఇక అటు నాగచైతన్య కూడా అంతే.ఎప్పుడూ సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ రిజర్వుడ్ గా ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు.

బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలో నేను మీరు నటించిన మూడు సినిమాల్లో నటించాను అని చెప్తే నాగార్జున గారు గుర్తుపట్టలేదు.

ఆ తర్వాత రక్షణ, వారసుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం లాంటి సినిమాల్లో చేశాను అంటూ చెప్పడంతో అప్పుడు నేను నటించిన సీన్లను గుర్తుచేసుకున్నారు నాగార్జున.

ఇప్పటివరకు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ గార్లతో నటించే అవకాశం వచ్చింది ఇక రానున్న రోజుల్లో వెంకటేష్ గారి సినిమాలో నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు నాగ మహేష్.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అతిథులు ఎవరంటే?