నాగ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ దేవాలయానికి వెళ్లాల్సిందే..!

నాగ దోషం( Naga Dosham ) అనేది హిందూమతంలో ఒక విశ్వాసం అని చాలామందికి తెలియదు.

ఒక వ్యక్తి జాతకం ప్రకారం నాగ దోషము ఉంటే కచ్చితంగా పరిహారం చేయించుకోవాలి.

అయితే ఈ గుడికి వెళ్లడం ద్వారా అలాంటి పరిహారాలు జరుగుతాయని ఈ పెద్దలు చెబుతున్నారు.

ఒక వ్యక్తికి నాగ దోషం ఉంటే అది అరిష్టం, ఆర్థిక నష్టానికి, సంతాన నష్టానికి దారితీస్తుంది.

ఆ దోషం పోవాలంటే ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి.అలాగే చాలా సంవత్సరాల వరకు వివాహం( Marriage ) కాకపోయినా, వివాహం అయినప్పటికీ పిల్లలు పుట్టకపోయినా అది నాగ దోషంగా భావించాలి.

నాగ దోషం అనేది పూర్వజన్మలో పాములని చంపే వారికి, ఔషధాలతో సర్పాలని బంధించే వారికి, పుట్టలను తవ్వేవారికి, పుట్టలను తొలగించి ఇల్లు కట్టుకునే వారికి నాగదోషం కలుగుతుందని పెద్దవారు చెబుతున్నారు.

జాతక చక్రంలో రాహు లేదా కేతువు( Rahu Ketu ) ఒకటి, రెండు, ఐదు, ఏడు, ఎనిమిది స్థానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాలలో ఉంటే సర్ప దోషం ఉందని చెబుతారు ఇలాంటి వాళ్ళు సమయానికి సంతానం లేక ఇబ్బంది పడతారు.

"""/" / అలాగే మరికొంత మందికి సమయానికి వివాహం కూడా జరగదు.ఇలాంటి వాళ్ళు కచ్చితంగా పరిహారం చేయించుకుని తీరాలి.

నాగదోషంతో ఇబ్బంది పడేవారు కృష్ణాజిల్లాలో ఉండే మోపిదేవి దేవాలయానికి( Mopidevi Temple ) కచ్చితంగా వెళ్లాలి.

ఈ ప్రాంతం మచిలీపట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.దీనిని మోహినిపురం అని కూడా అంటారు.

మోపిదేవి దేవాలయం చాలా విశిష్టమైనది. """/" / అక్కడ సుబ్రమణ్యేశ్వర స్వామి( Subramanyeswara Swamy ) సర్పరూపంలో వెలిశాడు.

నాగపంచమి రోజు ఈ పుణ్య క్షేత్రానికి దేశ నలమూలాల నుంచి లక్షలాదిమంది భక్తులు వస్తూ ఉంటారు.

సర్ప దోషంతో బాధపడేవారు, వివాహం జరగక బాధపడేవారు, సంతానం కోసం ప్రయత్నించేవారు మోపిదేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారని భక్తులు నమ్ముతారు.

ఈ జనరేషన్ లో పోలీస్ రోల్స్ లో ఎక్కువగా నటించి విజయాలు సాధించిన స్టార్ హీరో వీళ్లే!