లవ్ స్టోరీ సినిమా వాయిదాకు కారణం తెలుసా?
TeluguStop.com
ప్రస్తుతం కరోనా మరింత తీవ్రంగా మారడంతో దీని ప్రభావం ఏకంగా సినీ పరిశ్రమల పై పడింది.
గత ఏడాది కరోనా వల్లే వాయిదా పడిన సినిమాలు తిరిగి లాక్ డౌన్ తర్వాత మళ్లీ మొదలు పెట్టగా.
ఇప్పుడు మళ్లీ విడుదల చేసే సమయానికి కరోనా మళ్లీ అడ్డుపడింది.ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినీ పరిశ్రమలో నటీ నటుల మీద కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ విడుదలకు కారణం కూడా కరోనా వైరస్ అనే చెప్పవచ్చు.
ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస కరోనా కేసులు ఉండటంతో అక్కడ సినిమాలన్నీ ఆగిపోయాయి.
అంతే కాకుండా కొన్ని సినిమా షూటింగులు కూడా వాయిదా పడ్డాయి.ఇక తెలుగు సినీ పరిశ్రమలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే సరికి ప్రపంచమంతా వైరస్ దూసుకుపోతుంది కాబట్టి సినిమాల విడుదలకు దర్శకనిర్మాతలు ఎటువంటి స్పష్టతకు రాలేకపోతున్నారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా లవ్ స్టోరీ.నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ గా నటించారు.
ఇక ఈ సినిమా పాటలు విడుదల కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయడానికి సినీ బృందం అన్ని ఏర్పాట్లు చేసుకోగా రెండు రోజుల నుండి ఈ సినిమా పోస్ట్ పోన్ అంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి.
లవ్ స్టోరీ """/"/
నిజానికి ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని కన్ఫామ్ అవగా రానా హోస్ట్ చేస్తున్న నెంబర్ వన్ యారి షో ప్రోమో విడుదల కాగా అందులో ఈ సినీ బృందం విచ్చేశారు.
ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకోగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ముందు జాగ్రత్తలు చేపట్టాలని కోరింది.
దీంతో థియేటర్ లో ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీ ని చేయనున్నట్లు తెలిపింది.
అందుకే ఈ సినిమాను విడుదల వాయిదా చేసినట్లు నిర్మాత సునీల్ నారంగ్ తెలిపారు.
దీని తీవ్రత తొలిగి పోయిన తర్వాతే విడుదల చేస్తామని తెలిపారు.లవ్ స్టోరీ
ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య విషయాలపై రిస్కు పెట్టమని తెలిపారు.
ఇదిలా ఉంటే బహుశా మే 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు సిని బృందం సభ్యుల నుండి అధికారిక ప్రకటన వచ్చింది.
రాజమౌళి వల్లే తెలుగులో ఉన్న యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారా..?