'లాల్ సింగ్ చడ్డా'కు చైతూ అన్ని కోట్లు పుచ్చుకున్నాడా.. బిటౌన్ లో హాట్ టాపిక్!

అక్కినేని యంగ్ హీరోల్లో నాగ చైతన్య ఒకరు.ఈయన ఎప్పుడు క్లాసీ లుక్ తో అభిమానులను ఆకట్టు కుంటాడు.

ఎక్కువగా ప్రేమ కథలు చేస్తూ మెప్పిస్తూ మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.

మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూ ఇప్పుడు థాంక్యూ అంటూ వచ్చాడు.

కానీ ఈ సినిమా మాత్రం ప్లాప్ అయ్యి ఈయన హిట్స్ పరంపరకు అడ్డు తగిలింది.

ఇక థాంక్యూ తర్వాత చైతూ వెంటనే మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు.

అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా.

అద్వైత్ చందం డైరెక్టర్ చేసిన ఈ సినిమా ఈ ఏడాది పెద్ద సినిమాల్లో ఒకటిగా రిలీజ్ కాబోతుంది.

హిట్స్ లేక బాధపడుతున్న బాలీవుడ్ సైతం ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా కోసం మన తెలుగు సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటించాడు.

ఇది తనకు మొదటి డెబ్యూ సినిమా.ఈ సినిమాలో చైతూ అమీర్ స్నేహితుడు బోడి బాలరాజు పాత్రలో నటిస్తున్నాడు.

అనేక వాయిదాల తర్వాత ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. """/"/ ఈ క్రమంలోనే చైతూ గురించిన ఒక వార్త బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

నాగ చైతన్య తెలుగులో ఒక్కో సినిమాకు ప్రెజెంట్ 10 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడు.

ఇక లాల్ సింగ్ చడ్డా కు మాత్రం ఏకంగా 5 కోట్లు పుచ్చుకున్నాడని అక్కడి మీడియా లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇదే నిజమైతే చిన్న రోల్ కే ఇంత వసూలు చేయడం మాములు విషయం కాదు.

మరి చైతూ ఈ రోల్ లో గుర్తింపు పొందుతాడో లేదో చూడాలి.ఇక ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్ వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ లపై అమీర్ ఖాన్ కిరణ్ రావు రాధికా చౌదరి కలిసి నిర్మించారు.

తెలుగులో చిరంజీవి సమర్పణలో రిలీజ్ చేయడం విశేషము.పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో చూడాలి.

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటన